న్యూఇయర్ వేడుకలు... హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు, మార్గదర్శకాలివే..!!

  • IndiaGlitz, [Wednesday,December 29 2021]

మరో రెండు రోజుల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమవుతున్నారు. అయితే  ప్రస్తుతం ఒమిక్రాన్  నేపథ్యంలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే తెలంగాణలో తొలుత న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించిన ప్రభుత్వం.. తర్వాత మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 వరకూ మద్యం దుకాణాలు.. ఒంటిగంట వరకూ బార్లు, పబ్బుల్లో మద్యం సరఫరా ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈనేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్.. న్యూఇయర్ సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేశారు. పబ్బులు, హోటళ్లు, క్లబ్‌లు మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు.  

మాస్క్‌ లేకుండా  వేడుకల్లో పాల్గొంటే  రూ.వెయ్యి జరిమానా.

రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న వారికే ఈవెంట్స్‌కు అనుమతి.

వేడుకల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి.

వేడుకలకు రెండ్రోజుల ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

బార్లు, రెస్టారెంట్లు, పబ్బుల్లో పనిచేసే సిబ్బందికి 48 గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేయాలి.

బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు.

సౌండ్ పొల్యూషన్‌పై స్థానికుల నుంచి ఫిర్యాదు వస్తే చర్యలు.

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే 6 నెలల జైలు, రూ.10వేల జరిమానా

అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా కఠిన చర్యలు.

వేడుకల్లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు

More News

'అంతఃపురం'లో రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది? ఈ నెల 31న తెలుసుకోండి!

అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు.

రోడ్డు ప్ర‌మాదానికి గురైన ‘‘బచ్పన్ కా ప్యారా’’ ఫేమ్ బాలుడు.. ప‌రిస్థితి విషమం

‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాలుడు సహ్‌దేవ్‌ దిర్దో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

పవన్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్... డీజే బాక్స్‌లు బద్దలే

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘‘భీమ్లా నాయ్’’.

జీవితంలో మంచి - చెడూ రెండూ వుండాలి : ఆకట్టుకుంటున్న రాజేంద్ర‌ప్రసాద్ ‘సేనాపతి’ ట్రైలర్

కరోనా, లాక్‌డౌన్ సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఇప్పుడు పెద్ద మార్కెట్‌గా మారింది.

ఆన్‌లైన్ సినిమా టికెట్లు , ధరలు తగ్గించింది అందుకే: ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల మూసివేత, సినిమా టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.