ఒక్క ట్వీట్ చాలు.. పోకిరీల పని ఫసక్..

  • IndiaGlitz, [Wednesday,September 23 2020]

ఇవాళా.. రేపు ట్విట్టర్ ఖాతాలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్విట్టరే బాధితులకు వరంగా మారనుంది. మనల్ని ఎవరో వేధిస్తున్నారంటూ మన బంధువులకో.. సన్నిహితులకో చెబుతుంటాం. కొందరు బంధువులు బాగానే రియాక్ట్ అయినప్పటికీ కొందరు మాత్రం పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల పలు అనార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్క మాట ట్విట్టర్ ద్వారా పోలీసుల చెవిన కూడా వేశారనుకోండి.

ఇక పోకిరీల పని ఫసకే. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో పాటు ప్రతి ఠాణా సీఐ పేరుతోనూ ట్విట్టర్ ఖాతాలున్నాయి. ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. నిమిషాల్లో స్పందిస్తామని పోలీస్ బాసులు చెబుతున్నారు. మీరు ఎలాగైతే ఫేస్‌బుక్, వాట్సాప్‌లను ఉపయోగిస్తున్నారో అలాగే ట్విట్టర్‌ను కూడా ఉపయోగించాలని చెబుతున్నారు. తమకు వచ్చే ట్వీట్‌లను ఫిర్యాదుగా స్వీకరించి పోకిరీల పని పడతామని సోషల్ మీడియా ద్వారా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. మహిళలపై వేధింపుల పర్వం పెరుగుతోంది.

నంబర్ తెలిస్తే చాలు.. వివిధ నంబర్ల నుంచి కాల్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలను పోలీసుల వరకూ తీసుకెళితే అల్లరవుతామనే భయంతో బాధితులు మిన్నకుండి పోతున్నారు. దీంతో పోలీసులు ఈ స్టెప్ తీసుకున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్, సోషల్ మీడియా ద్వారా వేధింపులను ఎదుర్కొంటున్న వారి కోసమే వాట్సాప్, ట్విట్టర్ సేవలను పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. బాధితుల వివరాలను సైతం పోలీసులు గోప్యంగా ఉంచుతారు.

More News

భారత్‌లో 57 లక్షలకు చేరువలో కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 57 లక్షలకు చేరువవుతుండగా.. మరణాల సంఖ్య 90 వేలు దాటింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

'రంగ్‌దే' షూటింగ్ స్టార్ట్..

‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించిన అనంతరం అదే జోష్‌తో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నేతల విషయంలో పాటించలేదనేది పలువురి వాదన. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆదిలోనే కంట్రోల్‌లో పెట్టి ఉండే

బిగ్‌బాస్: వార్ బిగిన్స్.. ఇక బీభత్సమే..

నేటి బిగ్‌బాస్ షో మొత్తం ఫిజికల్ టాస్క్‌తో నడిచింది. రోబోలు, మనుషుల మధ్య వార్ ఆసక్తికరంగా నడిచింది. పోయిన వారం సెల్ఫ్ నామినేట్ అవడంతో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు.

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..

వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.