హైదరాబాదీలను బెంబేలెత్తిస్తున్న కరోనా హాట్ స్పాట్స్..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే జరగకపోయింటే పరిస్థితి ఈ పాటికే అదుపులోకి వచ్చేదేమో..! ఆ ఘటనతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మరీ ముఖ్యంగా మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారిలో తెలంగాణలో హైదరాబాద్ నుంచి.. ఏపీలో కర్నూలు నుంచి ఎక్కువగా వెళ్లడంతో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి..? ఏయే ప్రాంతాలు కరోనాకు హాట్ స్పాట్స్..? ఏయే ప్రాంతాల్లో జనాలు అస్సలు తిరగకూడదు..? అనేదానిపై తాజాగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ హాట్ స్పాట్‌ల గురించి విన్న హైదరాబాదీలు బెంబేలెత్తిపోతున్నారు.

హైదరాబాద్ నగరంలో కరోనా హాట్ స్పాట్స్ ఇవే..

01. రాంగోపాల్‌పేట షేక్‌పేట
02. రెడ్‌ హిల్స్‌
03. మలక్‌పేట- సంతోష్‌నగర్‌
04. చాంద్రాయణగుట్ట
05. అల్వాల్‌
06. మూసాపేట
07. కూకట్‌పల్లి
08. కుత్బుల్లాపూర్‌- గాజులరామారం
09. మయూరినగర్‌
10. యూసుఫ్‌గూడ
11. చందానగర్‌
12. బాలాపూర్‌
13. చేగూరు
14. తుర్కపల్లి

వీటితో పాటు.. మేడ్చల్, మల్కాజిగిరిలో మరో మూడు ప్రాంతాలున్నాయి. కాగా ఈ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అధికారులు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో జనాలు అస్సలు బయటికి తిరగొద్దని ఇప్పటికే పోలీసుల నుంచి హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది.

More News

మరోసారి లారెన్స్ దాతృత్వం.. 3 కోట్లు విరాళం

ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ మంచి మనసు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎంతో మందిని అనాధ పిల్లలు, దివ్యాంగాలను అక్కున చేర్చుకుని వారిని పోషిస్తున్నాడు.

మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌లోనూ డోర్ డెలివరీ!

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మద్యం ప్రియులు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీంతో బార్‌లు తెరవండి లేదా హోమ్ డెలీవరి చేయాలనే డిమాండ్ యావత్ దేశ వ్యాప్తంగా పెరిగింది.

'అన్నయ్య' హనుమాన్ ట్వీట్‌పై 'తమ్ముడు' రియాక్షన్ ఇదీ..

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తర్వాత యమా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవలే ఏప్రిల్-08తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి..

ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి కోప‌మొచ్చింది

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మే ప్ర‌పంచంగా ఉంటారు. సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు ఆయ‌న సంద‌ర్భానుసారం మెసేజ్‌ల‌ను పోస్ట్ చేస్తుంటారు.

భారత్‌కు.. ఇండియన్స్‌కు కృతజ్ఞతలు..: ట్రంప్

అమెరికాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ (యాంటీ-మలేరియా) ఔషధం ఎగుమతి విషయంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ