నలుగురు హీరోలతో నటించాను - తాప్సీ

  • IndiaGlitz, [Thursday,July 20 2017]

70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై తాప్సీ ప‌న్ను, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, , ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం 'ఆనందో బ్ర‌హ్మ‌'. మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి నిర్మాత‌లు. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో

చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన విజ‌య్ చిల్లా మాట్లాడుతూ - ''ఈ క‌థను ద‌ర్శ‌కుడు మ‌హి చెప్పేట‌ప్పుడు హార‌ర్ కామెడి జోన‌ర్ అన్నాడు. కానీ క‌థ‌లో మ‌నుషుల‌ను చూసి దెయ్యం భ‌య‌ప‌డుతుంది అనే పాయింట్ నాకు న‌చ్చింది. సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. అక్క‌డ నుండి ద‌ర్శ‌కుడు మ‌హినే న‌టీన‌టుల‌ను సినిమాలో న‌టించేలా ఒప్పించాడు. సినిమా టెక్నిక‌ల్‌గా బావుంటుంది. శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతుర‌మేష్‌, వెన్నెల‌కిషోర్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. బాగా సపోర్ట్ చేశారు. సినిమాను ఆగస్ట్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్ మాట్లాడుతూ - ''నేను ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా క‌థ‌ను 50 శాతం రాస్తే, మిగిలిన 50 శాతం న‌టీన‌టులే వారి న‌ట‌న‌తో పూర్తి చేస్తారు. అలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే నేను దెయ్యాల‌ను పెద్ద‌గా న‌మ్మ‌ను. అందుకే హారర్ కామెడీ సినిమా క‌థ రాయ‌గ‌లిగాను. సాధార‌ణంగా దెయ్యాల‌కు మ‌నుషులు భ‌య‌ప‌డుతుంటారు. కానీ దెయ్యాలు మ‌నుషులకు భ‌య‌ప‌డితే అనే పాయింట్‌తో క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాను. వెన్నెల‌కిషోర్‌గారు ఇందులో చాలా ట‌ఫ్ రోల్ చేశాడు. ప‌టాస్ సినిమా స‌మ‌యంలో శ్రీనివాస‌రెడ్డి న‌ట‌న నాకు బాగా న‌చ్చింది. అందుకే ఈ సినిమాలో త‌న‌ను తీసుకున్నాను. త‌ను క్యారెక్ట‌ర్‌ను బాగా ఇంప్ర‌వైజ్ చేయ‌గ‌ల‌డు. ముందు ఓ క్యారెక్ట‌ర్‌కు తాగుబోతు ర‌మేష్‌ను తీసుకోకూడ‌ద‌ని అనుకున్నాం. కానీ చివ‌ర‌కు త‌ను త‌ప్ప, మ‌రెవ‌రూ ఆ క్యారెక్ట‌ర్ చేయ‌లేర‌నిపించి త‌న‌నే తీసుకున్నాం. ష‌క‌ల‌క శంక‌ర్ త‌న‌దైన స్టైల్‌లో న‌వ్విస్తాడు. ఈ న‌లుగురు న‌టులు ఒక‌రిని మించి ఒక‌రు బాగా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అనీష్ సినిమాటోగ్ర‌ఫీ, కె సంగీతం, ఎడిటింగ్ ఇలా బ‌ల‌మైన టెక్నిక‌ల్ టీం కూడా త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించారు'' అన్నారు.

తాప్సీ ప‌న్ను మాట్లాడుతూ - '' సాధార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు నేను న‌టించిన చిత్రాల్లో నాకు ఓ హీరో ఉంటాడు. కానీ ఈ చిత్రంలో నాకు న‌లుగురు హీరోలున్నారు.నేను మొద‌టిసారి చేసిన హార‌ర్ కామెడీ చిత్ర‌మిది. ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. త‌ప్ప‌కుండా సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది'' అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ - ''భలే మంచి రోజు వంటి మంచి సినిమా చేసిన విజయ్‌గారు ఓ రోజు న‌న్ను సినిమా చేస్తున్నాం. అందులో నువ్వు న‌టించాల‌ని అన్నారు. ద‌ర్శ‌కుడెవ‌ర‌ని అన్నాను. ఆయ‌న న్యూజిలాండ్‌లోని మ‌హిగారితో మాట్లాడించారు. ఆయ‌న హార‌ర్ కామెడి జోన‌ర్ అనగానే ముందు చేయ‌కూడ‌ద‌ని అనుకున్నాను. కానీ ఆయ‌న రివ‌ర్స్‌లో మ‌నుషుల‌కు దెయ్యాలు భ‌య‌ప‌డ‌తాయ‌ని అన్నారో ఆ పాయింట్ న‌చ్చ‌డంతో చేయ‌డానికి ఒప్పుకున్నాను. సినిమాలో క‌థే హీరో. మంచి క్యారెక్ట‌ర్ చేశాను. ఈ సినిమాను హార‌ర్ కామెడి అంటున్నారు, కానీ ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోష‌న్ ఉంటుది. ఆ పాయింట్ ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంది. టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి పోస్ట‌ర్స్‌, మోష‌న్ పోస్ట‌ర్స్ ఇలా అన్నింటికీ మంచి రెస్పాన్స్ వ‌చ్చింది'' అన్నారు.

వెన్నెల‌కిషోర్ మాట్లాడుతూ - ''భ‌లే మంచి రోజు సినిమాలో నేను ఓ చిన్న పాత్ర చేశాను. అదే ప‌రిచ‌యంతో నిర్మాత‌గారు న‌న్ను పిలిచి ఈ క్యారెక్ట‌ర్ గురించి చెప్పారు. ఇందులో నా క్యారెక్ట‌ర్ చాలా సెటిల్‌డ్‌గా ఉండి ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. 100 శాతం సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది'' అన్నారు.

తాగుబోతు రమేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, సినిమాట‌గోగ్రాఫ‌ర్ అనీష్ త‌రుణ్ కుమార్‌, ఎడిట‌ర్ శ్ర‌వ‌ణ్ కటిక‌నేని త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, రాజీవ్ క‌న‌కాల‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, విద్యుల్లేఖా రామ‌న్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి వి.ఎఫ్‌.ఎక్స్ః ఈవా మోష‌న్ స్టూడియోస్‌, సౌండ్ డిజైన్ః స్నిక్ సినిమా, ఎడిట‌ర్ః శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేని, సినిమాటోగ్ర‌ఫీః అనీష్ త‌రుణ్ కుమార్‌, మ్యూజిక్ః కె, నిర్మాత‌లుః విజ‌య్ చిల్లా, శ‌శి దేవిరెడ్డి, క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వంః మ‌హి వి.రాఘ‌వ్‌.

More News

రాణాతో ఫోటో దిగడం ఇప్పుడు చాలా ఈజీ

స్టార్లతో ఫోటోలు దిగడానికి సగటు సినిమా అభిమానులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ.. ఇకపై స్టార్ హీరోతో ఫోటో దిగడం సులభతరం చేసింది యాప్ స్టర్. "నేనే రాజు నేనే మంత్రి" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.

ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా టీమ్-5 విడుదల

భారత జాతీయ క్రికెటర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీశాంత్, ఇప్పుడు టీమ్-5 అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు. సురేష్ గోవింద్ దర్శకత్వం వహిస్తున్న టీమ్-5 చిత్రంలో కన్నడ భామ నిక్కీ గర్లాని కథానాయికగా నటిస్తోంది.

బృందావనమది అందరిది మూవీ తో దర్శకుడిగా మారుతున్న రచయిత శ్రీధర్ సీపాన

పలు సూపర్ హిట్ చిత్రాలకు సంభాషణలు అందించిన రచయిత శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారబోతున్నారు. నూతన నటీనటులతో ఆయన తన తొలి సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రానికి బృందావనమది అందరిది అనే టైటిల్ ను ఖరారు చేశారు.

'వైశాఖం' బి.ఎ.రాజుగారికి, జయగారికి మంచి పేరు తెస్తుంది - కింగ్ నాగార్జున

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం`. ఈ సినిమా జూలై 21న విడుదలవుతుంది.

చెర్రీ దంపతులు పెద్ద మనసు

పరాయి రాష్ట్రం అస్సాంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా 65 మంది మరణించారు. ప్రజలు కనీస అవసరాలైన తిండి, నీరు లేక ఇబ్బందలు పడుతున్నారు.