నన్ను మించిన మాస్ డైరెక్టర్ ఉన్నాడా...

  • IndiaGlitz, [Sunday,October 18 2015]

గ‌మ్యం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...వేదం, క్రిష్ణం వందేజ‌గ‌ద్గురుమ్..చిత్రాల‌తో మంచి సినిమాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్ట‌ర్ క్రిష్. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌థ్యంతో రూపొందిన కంచె చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా ఈనెల 22న రిలీజ్ చేస్తున్నారు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...క్రిష్ మంచి చిత్రాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు సంపాదించాడు కానీ...క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ గా పేరు సంపాదించ‌లేక‌పోయాడు. దానికి కార‌ణం క్రిష్ ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోవ‌డ‌మే. ఇదే విష‌యాన్ని క్రిష్ తో అంటే... ఇప్ప‌టి వ‌ర‌కు నాకు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ రాలేదు. కంచె సినిమా ఖ‌చ్చితంగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అన్నారు. అలాగే త‌న‌పై ప‌డిన మంచి సినిమాల ద‌ర్శ‌కుడి ముద్ర గురించి స్పందిస్తూ..గ‌మ్యం సినిమాలో గాలి శీను క్యారెక్ట‌ర్ ను ఎంత మాస్ గా చూపించాను. అస‌లు న‌న్ను మించిన మాస్ డైరెక్ట‌ర్ ఎవ‌రున్నారు అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు క్రిష్. మ‌రి..క్రిష్ చెప్పింది నిజ‌మేనా..?

More News

ర‌వితేజ ఎన్నాళ్లెన్నాళ్ల‌కు

మాస్ ప్రేక్ష‌కుల‌కు కిక్ ఎక్కించే అంశాల్లో ఒక‌టి ఏమిటంటే.. ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి మ‌న హీరో మాంచి హుషారైన సాంగేసుకోవ‌డం. ఇప్పుడు ఇదే ఫార్ములాని మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కూడా అప్ల‌య్ చేస్తున్నాడు

వెండితెర అద్భుతం.. బాహుబ‌లి శ‌త‌దినోత్స‌వం

తెలుగు వారు గ‌ర్వించ‌ద‌గ్గ సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా...ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా దాదాపు 600 కోట్లు పైగా వ‌సూలు చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

గుజరాత్ లో గబ్బర్ సింగ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.

మీడియాకు సారీ చెప్పిన స‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ నాన‌క్ రామ్ గూడ‌లో జ‌రుగుతుంది.

రామ్ చ‌ర‌ణ్ బ్రూస్ లీ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్ట్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల తెర‌కెక్కించారు. డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య నిర్మించారు.