ఆ చిత్రాన్ని పవన్ సర్ చేయడం చాలా ఆనందాన్నిస్తోంది: చిన్మయి

తానొక సందేశాత్మక చిత్రాన్ని చూశానని.. అది తనకు ఎంతగానో నచ్చిందని సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆ చిత్రం మరేదో కాదు.. స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన‘నెర్కొండ పార్వై’. తెలుగులో ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కనుంది. తెలుగులో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. అయితే తాను తొలుత ఈ చిత్రాన్ని చూడటానికి భయపడ్డానికి కానీ ఒక సందేశాన్ని చాలా సున్నితంగా చెప్పిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని చిన్మయి వెల్లడించింది.

‘‘సినిమాలు చూసే విషయంలో నేనొక ఆనందాన్ని పంచే చిత్రాలు చూసే సాధారణ ప్రేక్షకురాలిని మాత్రమే. కొన్ని చిత్రాలను చూసి జీర్ణించుకోవడం నాకు చాలా కష్టం. అయితే నేను ‘నెర్కొండ పార్వై’ని చూసేందుకు భయపడ్డాను. ఎందుకంటే అది చూసేందుకు చాలా కష్టంగా ఉంటుందని భావించాను. చివరికి ధైర్యం తెచ్చుకుని ఈ చిత్రాన్ని రాత్రి చూశాను. ఒక సెన్సిటివ్ మేనర్‌లో సందేశాన్ని అందించిన విధానాన్ని చూసి నేను చాలా సంతోషించాను. టీమ్ మొత్తానికి అభినందనలు. అజిత్ సర్ వంటి స్టార్ హీరోలు ఇలాంటి ఒక సందేశాత్మక చిత్రంలో నటించడం చాలా అద్భుతంగా అనిపించింది.

ఒక మెసేజ్‌ని జనాల్లోకి పంపించడంతో పాటు.. అందరూ ఆలోచించేలా.. అర్థం చేసుకునేలా.. ప్రశ్నించేందుకు వీలుగా ఈ చిత్రానికి ఆయన చాలా హెల్ప్ అవుతారు. ఈ చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ సర్ చేస్తున్నారని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. నెర్కొండ పార్వై, డియర్ కామ్రేడ్, బ్రోచేవారెవరురా వంటి చిత్రాలను నిర్మించిన వారిని డైరెక్టర్స్‌, రైటర్స్‌ను చూస్తే చాలా గర్వంగా అనిపిస్తోంది. మీ అర్థం చేసుకునే తత్వానికి, సెన్సిబులిటీకి ధన్యవాదాలు. అటువంటి పరిస్థితుల గురించి మేము ఎలా ఆలోచిస్తున్నాం.. ప్రతిస్పందిస్తున్నాం వంటి విషయాలను చెప్పేందుకు మీలాంటి మిత్రులను కలిగి ఉండాలని ఈ చిత్రం చెబుతోంది’’ అని చిన్మయి వెల్లడించింది.

More News

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ ప్రమాణ స్వీకారం..

బిహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

ఆది సాయికుమార్ హీరోగా ‘జంగిల్’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కథానాయకుడు ఆది సాయికుమార్ హీరోగా న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై

సినిమా రేంజ్‌లో స‌మంత రెమ్యున‌రేష‌న్‌..!

ఇప్పుడు వెండితెర‌పై స్టార్ ఇమేజ్‌ను తెచ్చుకున్న వారంద‌రూ బుల్లితెర‌పై రియాలిటీ షోస్‌ల‌లో, ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న టీవీ షోస్‌ల‌లోనూ న‌టిస్తున్నారు.

తెలుగు భాష గొప్ప‌తనాన్ని త‌మిళుల‌కి చెప్పిన క‌మ‌ల్‌

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాసన్.. ఇండియ‌న్ సినిమాల్లో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు.

అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో `గాలి సంప‌త్‌` చిత్రం ప్రారంభం

వ‌రుసగా భ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇస్తున్న బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ప‌ణ‌లో గాలి సంప‌త్ ప్రారంభ‌మైంది.