close
Choose your channels

చిరంజీవి లుక్‌ను కాపీ కొట్టాను: వ‌రుణ్‌తేజ్‌

Wednesday, September 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరంజీవి లుక్‌ను కాపీ కొట్టాను: వ‌రుణ్‌తేజ్‌

స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వ‌చ్చినా కూడా ఇమేజ్ చట్రంలో ఇరుక్కు పోకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్న హీరో వ‌రుణ్‌తేజ్‌. ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ పాత్ర‌లో మెప్పించ‌డానికి రెడీ అయ్యారు. వ‌రుణ్‌తేజ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `వాల్మీకి`. సెప్టెంబ‌ర్ 20న విడుద‌ల‌ కాబోతోంది.

ఈ సినిమాలో పాత్ర గురించి వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ ``సాధార‌ణంగా డైరెక్ట‌ర్స్ నా ద‌గ్గ‌రికీ ల‌వ్ స్టోరీనే చెప్పాల‌ని వ‌స్తాడు. అయితే అప్ప‌టికే ఫిదా, ఎఫ్ 2 సినిమాల్లో ల‌వ‌ర్‌బోయ్‌గా క‌న‌ప‌డ‌టంతో ల‌వ్ సినిమాల‌కు గ్యాప్ ఇద్దామ‌ని అనుకున్నాను. ఆ స‌మ‌యంలో హ‌రీశ్‌గారు `దాగుడుమూత‌లు` క‌థ‌తో నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. ఆ క‌థ న‌చ్చింది. అయితే ఆయ‌న స్టైల్లో ఓ సినిమా చేయాల‌నుంద‌ని ఆయ‌న‌కు చెప్పాను. అప్పుడాయ‌న త‌మిళ చిత్రం `జిగ‌ర్‌తండా` గురించి చెప్పారు. ఆ సినిమా చూడు త‌ర్వాత మాట్లాడుదాం అన్నారు. నేను సినిమా చూశాను. సినిమా బాగా న‌చ్చింది. త‌ర్వాత ఇద్ద‌రం కూర్చుని మాట్లాడుకుని మార్పులు చేర్పులు చేసుకున్నాం. త‌మిళంలో బాబీ సింహ పాత్ర‌ను తెలుగులో నేను చేశాను. అస‌లు ఆ పాత్ర నెగెటివ్‌గా ఎందుకు మారింద‌నేది త‌మిళంలో చూపించ‌లేదు. కాబ‌ట్టి హ‌రీశ్ తెలుగులో ఆ పాత్ర‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేశాడు. ఇక లుక్ విష‌యానికి వ‌స్తే నేను చిరంజీవిగారి లుక్‌ను కాపీ కొట్టాను. నిజానికి డాడీనే ఆ లుక్‌ను నాకు పంపారు. `పునాదిరాళ్ళు` స‌మయంలో డాడీ అలాగే ఉండేవారు. అదే హెయిర్ స్టైల్‌ను ఇందులో నేను ట్రై చేశాను. అలాగే సినిమా క‌థ‌ను కూడా ముందు చిరంజీవిగారికే వినిపించాం. ఆయ‌నకు పాత్ర బాగా న‌చ్చింది. కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారు`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.