అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు: సాయి తేజ్

  • IndiaGlitz, [Thursday,October 29 2020]

తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సుప్రీం హీరో సాయి తేజ్ స్పందించాడు. తనకు అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు. గత కొన్ని రోజులుగా సాయి తేజ్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో నిహారిక పెళ్లి తర్వాత జరగబోయేది సాయి తేజ్ పెళ్లేనంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సాయితేజ్‌ది చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని కొన్ని వార్తలొస్తే.. పెద్దలు కుదిర్చిన వివాహమేనంటూ కొన్ని వార్తలు వచ్చాయి. 2021లో సాయితేజ్ వివాహం చేసుకోబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారాలన్నింటికీ సాయి తేజ్ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అంత త్వరగా తనకు వివాహం చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు. తన కుటుంబ సభ్యులు తన కోసం వధువును వెదకాలని భావిస్తున్నారని.. దానికి మాత్రం తాను ఓకే చెప్పానని సాయితేజ్ వెల్లడించాడు. తన పెళ్లి విషయంలో మీడియా చూపిస్తున్న అత్యుత్సాహమే ఈ రూమర్స్ అన్నీటికీ కారణమని తెలిపాడు. ప్రస్తుతం సాయితేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో దేవా కట్టా దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

More News

మ్యాచ్ మధ్యలో భార్యకు విరాట్ సైగలు.. వీడియో వైరల్..

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు అబుదాబి వేదికగా మారిన విషయం తెలిసిందే.

అమ్మ చాక్లెట్ రచ్చ.. హారికపై అభి ఫైర్

నిన్నటి బేబి డే కేర్ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. హారిక చాక్లెట్స్‌ను కొట్టేసింది. దీంతో అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు. ఇంక నేను ఆడనని తేల్చేశారు. అయితే ఎవరు చెప్పినా హారిక వినలేదు.

బిహార్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 53.54 శాతం ఓటింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. నేడు మొదటి దశ పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో 53.54 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

నన్ను నేను అద్దంలో చూసుకుని కుప్పకూలిపోయా: అవికా

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్ అనంతరం ‘ఉయ్యాల జంపాల’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హరోయిన్‌గా పరిచయమైంది.

బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవికి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది

బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి భూపాలంకి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఎంగేజ్‌మెంజ్ రింగ్‌తో ఉన్న ఓ పిక్‌ను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.