మ‌హేష్ తో ల‌వ్ లో ప‌డిపోయా అంటున్న హీరోయిన్..!

  • IndiaGlitz, [Thursday,November 24 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క్రేజు - ఇమేజు అంతా ఇంతా కాదు..! విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌బ‌ట్టే బ‌డా కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌హేష్ బాబునే ఎంచుకుంటున్నాయి. సామాన్యులు నుంచి సెల‌బ్రెటీస్ వ‌ర‌కు మ‌హేష్ ను అభిమానిస్తారు. ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్స్ ని మీ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు అంటే మ‌హేష్ బాబు అని చెబుతారు.

తాజాగా అవును, అవును 2 రాజు గారి గ‌ది...ఇలా హ‌ర్ర‌ర్ మూవీస్ లో న‌టించే హ‌ర్ర‌ర్ క్వీన్ పూర్ణ తొలి చూపులోనే మ‌హేష్ తో ల‌వ్ లో ప‌డిపోయాను అని చెప్పింది. మ‌హేష్ లో ల‌వ్ లో ప‌డ‌డం ఎలా జ‌రిగింది అని అడిగితే...నేను హైద‌రాబాద్ లో ఫ‌స్ట్ దిగ‌గానే మ‌హేష్ బాబు హోర్డింగ్ చూసాను అంతే....ఆ క్ష‌ణ‌మే మ‌హేష్ తో ల‌వ్ లో ప‌డిపోయాను. అందుక‌నే శ్రీమంతుడు సినిమాలో ఓ సాంగ్ చేయాలి అన‌గానే ఇంక ఏమీ ఆలోచించ‌కుండా వెంట‌నే ఓకే చెప్పేసాను. ఆ పాట‌లో క‌నిపించింది కొద్దిసేపే అయినా మ‌హేష్ మూవీలో అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అంటోంది పూర్ణ‌. ఇది మ‌హేష్ తో పూర్ణ ప్రేమ‌క‌థ‌..!

More News

అందరూ వద్దన్నా... అందుకే శ్రీనివాస రెడ్డితో చేశా: పూర్ణ (ఇంటర్వ్యూ)

శ్రీమహాలక్ష్మి, సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, అవును 2, రాజు గారి గది తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక పూర్ణ. తాజాగా శ్రీనివాస రెడ్డి - పూర్ణ జంటగా నటించిన చిత్రం జయమ్ము నిశ్చయమ్మురా. ఈ చిత్రాన్ని శివరాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శివరాజ్ కనుమూరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. సమైక్యంగా నవ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశవాళి ఎంటర్ టైన్

ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'విన్నర్'

సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'విన్నర్ ' చిత్రం ఫారిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

సెన్సార్ కు ముందే హ్యాండిచ్చేశారు : డి. వెంకటేష్

'తెలుగు వెర్షన్ రిలీజ్ కి తగినంత సమయం ఇవ్వకుండా తమిళ నిర్మాతలు మమ్మల్ని బుక్ చేసేశారు.

మహేష్ - మురుగుదాస్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఓం నమో వేంకటేశాయ లో నాగ్ న్యూగెటప్ (ఎక్స్ క్లూజీవ్..)

నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.