'రామ్ అసుర్' సినిమాతో నటుడిగా  మంచి గుర్తింపు వచ్చింది: అభినవ్ సర్దార్

  • IndiaGlitz, [Thursday,December 02 2021]

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ ఇటీవల విడుదలైన 'రామ్ అసుర్' తన కెరీర్‌లో బిగ్ సక్సెస్ అందుకున్నారు. సూరి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో టాలెంట్ చూపిస్తూ ఫస్టాఫ్‌లో లవర్ బాయ్‌గా, సెకండాఫ్‌లో అసురుడిగా మెప్పించారు. ఈ మూవీలో లుక్ పరంగా అట్రాక్ట్ చేసిన ఆయన టాలీవుడ్ యష్‌గా ప్రేక్షకుల నోళ్ళలో నానుతున్నారు.

రీసెంట్‌గా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న రామ్ అసుర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తుండటం పట్ల హీరో అభినవ్ సర్దార్ ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు పదేళ్ల క్రింద తన సినీ ప్రయాణాన్ని ఆరంభించిన అభినవ్ సర్దార్.. తన సంపాదనలో 10 శాతం మేర దాతృత్వ పనుల కోసం ఖర్చు చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు.

ఈ సందర్భంగా అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. ''రామ్ అసుర్‌ సినిమాతో నటుడిగా, నిర్మాతగా బిగ్ సక్సెస్ అందుకున్నా. కెరీర్‌లో ఇంకా చాలా సాధించేది ఉంది. అను నిత్యం నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉంటా. ఈ చిత్రంలో నేను పోషించిన రెండు డిఫరెంట్ షేడ్స్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకొని నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించాయి. మూవీ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్, సినీ క్రిటిక్స్, సినీ ప్రముఖుల నుంచి అందిన ప్రశంసలతో కెరీర్‌పై మరింత నమ్మకం పెరిగింది. ముందు ముందు మరిన్ని డిఫరెంట్ కథలతో ప్రేక్షకలోకాన్ని అలరిస్తా.

రామ్ అసూర్ విజయం తర్వాత నాకు తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా కొన్ని బిగ్ ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా విజయం కొత్త ఉత్సాహాన్నివ్వడమే గాక నటుడిగా నా లోని టాలెంట్ బయటపెట్టే అవకాశం ఇచ్చింది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు గాను దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞలు చెబుతున్నా. త్వరలో నా తదుపరి సినిమాల వివరాలను వెల్లడిస్తా'' అన్నారు.

More News

శిల్పా బాధితుల్లో మహేశ్ బాబు చెల్లెలు... పోలీసులకు ఫిర్యాదు, ఉలిక్కిపడ్డ టాలీవుడ్

కిట్టి పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులను పరిచయం చేసుకుని వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరి బాగోతంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.

మ‌హేష్ బాబుకి స‌ర్జ‌రీ.. ‘‘సర్కార్ వారి పాట’’కి కొద్దిరోజుల పాటు బ్రేక్

సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ చేయించుకోనున్నారు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో .. మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకోవడంతో ఫైనల్ బెర్త్‌ల కోసం టాస్క్‌లు మొదలయ్యాయి.

ఏపీ వరదలు: ఎట్టకేలకు కదిలిన టాలీవుడ్.. తలో రూ.25 లక్షలు ప్రకటించిన ఎన్టీఆర్, చిరంజీవి, మహేశ్, చెర్రీ

వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ కొద్దిరోజుల క్రితం చివురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే.

కరోనా నుంచి కోలుకున్న కమల్ హాసన్... హెల్త్ బులెటిన్ విడుదల

కరోనా వైరస్ బారినపడిన విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ కోలుకున్నారు.