నేను కూడా అవ‌మానాల‌ను ఎదుర్కొన్నా:  ఐశ్వ‌ర్యా రాజేశ్‌

  • IndiaGlitz, [Monday,May 25 2020]

తెలుగుతో పాటు త‌మిళంలోనూ హీరోయిన్‌గా త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది ఐశ్వ‌ర్యా రాజేశ్‌. అయితే త‌న‌కు స‌క్సెస్ అంత సుల‌భంగా రాలేద‌ని ఐశ్వ‌ర్యా రాజేశ్ అంటున్నారు. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘కెరీర్ ప్రారంభంలో నేను చాలా అవ‌మానాల‌ను ఎదుర్కొన్నాను. నేను సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి నాళ్లలో నాకు చెప్పినంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేదు. నా రంగును అందుక సాకుగా చూపేవారు. అయితే నేను బోల్డ్‌గా ఉంటాను. ఆ ధైర్య‌మే న‌న్ను ఈ స్థాయిలో నిల‌బెట్టింది. న‌న్ను నేను న‌మ్మాను. స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన‌డం నాకు తెలుసు’’ అన్నారు ఐశ్వ‌ర్యా జేశ్‌.

నిజానికి ఐశ్వ‌ర్య తెలుగు అమ్మాయి. సీనియ‌ర్ న‌టి, క‌మెడియ‌న్ శ్రీల‌క్ష్మి మేన‌కోడలు. తమిళ‌నాడులో స్థిర‌ప‌డ‌టం వ‌ల్ల అక్క‌డే అవ‌కాశాల‌ను వెతుక్కుంది. త‌మిలంలో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న ఐశ్వ‌ర్యా రాజేశ్ త‌మిళంలో దాదాపు పాతిక సినిమాల్లో న‌టించిన త‌ర్వాత తెలుగులో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. తెలుగు కౌస‌ల్య కృష్ణ‌మూర్తి సినిమాలో ఈమె టైటిల్ పాత్ర‌లో న‌టించింది. త‌ర్వాత వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌తో పాటు మ‌రో తెలుగు సినిమాలోనూ నటించింది. అయితే తెలుగులో ఈమెకు ఆశించిన స్థాయిలో బ్రేక్ మాత్రం రావ‌డం లేదు.

More News

చిరు చిన్న‌ల్లుడి చ‌పాతీలు.. శ్రీజ సెటైర్‌

లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం, షూటింగ్స్ ఆగిపోవ‌డంతో సినీ తార‌లంద‌ర ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వీరంద‌రూ కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డ‌మే కాకుండా.

టీటీడీ ఆస్థులు అమ్మ‌కం.. నాగ‌బాబు ట్వీట్‌

మెగాబ్రదర్ నాగబాబు లాక్డౌన్ వల్ల షూటింగ్స్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఈయ‌న త‌న భావాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

‘నో పెళ్లి...’ వీడియో సాంగ్‌లో సాయితేజ్‌తో పాటు వ‌రుణ్ తేజ్‌, రానా సంద‌డి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`.

సినీ ఇండస్ట్రీకి గుడ్ బై.. యాంకరింగ్‌కు సై అంటున్న సురేఖా..!

సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ.. బుల్లితెరను ఏలుతున్న రారాణులు.! టీవీ షోలతో తెలుగింట ప్రతి ఒక్కరికీ పరిచయమైన ఈ యాంకర్ల జాబితాలోకి తాజాగా మరో పేరు చేరబోతుందా..?

థియేటర్ల ఓపెనింగ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ క్లారిటీ..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌‌తో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్లు మూసివేసిన విషయం విదితమే.