ఆ విష‌యంలో నేనేం మార‌లేదు: రాజ‌మౌళి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్‌స్టార్స్ అయిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను, రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అల్లూరి పాత్రలో రామ్‌చ‌ర‌ణ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ రెండింటికీ ప్రేక్ష‌కుల నుండి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో అస‌లు బాహుబ‌లి త‌ర్వాత సినిమా మేకింగ్‌లో మీ కోణం ఏమైనా మారిందా అని అడిగితే, రాజ‌మౌళి త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చారు.

నేను క‌థ‌ను చెప్పాల‌నుకున్న తీరులో ఎలాంటి మార్పు లేదు. కానీ సినిమా బ‌డ్జెట్, టెక్నిక‌ల్ విష‌యాల‌ను కథ‌లో భాగం చేసే విష‌యంలో మార్పులు వ‌చ్చాయన్నారు రాజ‌మౌళి. పాన్ ఇండియా చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌లతో పాటు మ‌రో ఐదు భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివియా మోరిస్‌, చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియా భ‌ట్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అలాగే మ‌రో బాలీవుడ్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, కోలీవుడ్‌కి చెందిన స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ యాక్టర్స్ రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీలు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

కరోనా నేపథ్యం : వైరల్ అవుతున్న ఈ తప్పుడు విషయాలు నమ్మకండి!

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు

నాకు కరోనా సోకలేదు.. ఆందోళన వద్దు : కమల్

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి.

సినీ కార్మికులకు సురేష్ ప్రొడక్షన్స్ కోటి విరాళం..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

స్టార్ హీరో అక్షయ్ 25 కోట్ల భారీ విరాళం

దేశవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వదలిచిన వారికి

కోటి రూపాయిలిచ్చి ‘కింగ్’ అనిపించుకున్న నాగ్..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.