ఆ ప‌నిచేయ‌డానికి రెండు వారాలు గ్యాప్ తీసుకున్నా:  నందితా శ్వేత‌

  • IndiaGlitz, [Wednesday,August 05 2020]

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి సినిమాల్లో దెయ్యం పాత్ర‌ల‌తో మెప్పించిన నందితా శ్వేతా ఇటు తెలుగు, అటు త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఈ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా ‘ఐపీసీ 376’ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం నందితా శ్వేత యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ న‌టించార‌ట‌. ముఖ్యంగా అండ‌ర్ వాట‌ర్ యాక్ష‌న్ సీన్ చేయాల్సి వ‌చ్చిన్న‌ప్పుడు ఆమె ఎలా ఫీల‌య్యార‌నే విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

‘‘‘ఐపీసీ 376’ సినిమాలో ఓ అండ‌ర్ వాట‌ర్ స‌న్నివేశం చేయాల‌ని ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ సుబ్బ‌రామ చెప్ప‌గానే భ‌య‌ప‌డ్డాను. ఎందుకంటే నాకు ఈత రాదు. అయితే బాగా ఆలోచించాను. చాలా కీల‌క‌మైన స‌న్నివేశం. అయితే నాకు నాకు సైనటిస్ స‌మ‌స్య కూడా ఉండ‌టంతో ఎలా అనుకున్నాను. ఈలోపు షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు చెన్నై ద‌గ్గ‌ర ఓ వాట‌ర్ ఫాల్ వ‌ర‌కు ధైర్యంగా వెళ్లాను. కానీ నీళ్ల‌లోకి దూక‌డానికి భ‌య‌ప‌డ్డాను. ఫైట్ మాస్ట‌ర్ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఏమీ కాద‌ని ఆయ‌న చెప్పినా ఎందుక‌నో నాకు ధైర్యం లేక‌పోయింది. దాంతో లొకేష‌న్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. రెండు వారాల పాటు బ్రేక్ తీసుకుని బెంగుళూరు వెళ్లాను. ఎందుకో తెలుసా? ఈత నేర్చుకోవ‌డానికి.. మొద‌టి మూడు రోజులు చాలా ఇబ్బందులే ప‌డ్డాను. నీళ్లు కూడా ఎక్కువ‌గా మింగేశాను. అయితే నాలుగో రోజు నుండి నెమ్మ‌దిగా అల‌వాటు ప‌డుతూ వ‌చ్చాను. ఇప్పుడు నాకు నీళ్లంటే భ‌యం లేదు’’ అని అన్నారు నందితా శ్వేత‌.

More News

నితిన్‌కు నో చెప్పిన పూజా హెగ్డే..?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

బీరుట్ పేలుళ్లకు కారణాన్ని వెల్లడించిన లెబనాన్ అధికారులు

లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్లకు కారణాన్ని లెబనాన్ అధికారులు కనుక్కున్నారు.

ధన్వంతరి నారాయణ మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు..

వినాయకచవితి వస్తోందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపూ ఖైరతాబాద్ వినాయకుని వైపే ఉంటుంది.

అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసిన మోదీ..

యావత్ భారతావనికి ఉత్కంఠ భరితమైన క్షణాలివి.. శ్రీరామ నామ జపంతో దేశ మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

అయోధ్యలో భూమిపూజ.. రావణుడు పుట్టిన బిస్రాఖ్‌లో సైతం సంబరాలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరగనున్న నేపథ్యంలో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది.