కష్టం వస్తే చెప్పండి ఆదుకుంటా: దిల్ రాజు

  • IndiaGlitz, [Friday,December 18 2020]

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను సినీ ఇండస్ట్రీ పక్కాగా ఫాలో అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చిందంటే దానిని నిలబెట్టుకోవడం కోసం.. తరతరాలకు సరిపడా సంపాదించుకోవడం కోసమే జీవితమంతా కష్టపడుతుంటారు. అంతేకానీ సోషల్ సర్వీస్ వైపు పెద్దగా చూడరు. ఇండస్ట్రీలో సేవా దృక్పథం ఉన్నావారంటే.. సోనూసూద్ వంటి వారిని వేళ్లపై లెక్కబెట్టగలిగే వారిని మాత్రమే చూడగలం. కానీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అది కూడా మంచి సక్సెస్ బాటలో నడుస్తున్న సమయంలో నాకు సోషల్ సర్వీస్ చేయాలని ఉంది. కష్టంలో ఉన్న వారిని నా దగ్గరకు తీసుకుంటే వారికి సాయం అందిస్తానని చెప్పేవారు ఉంటారా? అంటే ఉన్నారు.. అది మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..  

‘‘ఇండస్ట్రీలో సక్సెస్ అయిపోయాక.. ఎవరికైనా సేవా కార్యక్రమాల వైపు దృష్టి మరలుతుంది. కానీ నేను చాలా లక్కీఫెలో. సక్సెస్‌లో ఉండగానే ఇది జరుగుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అవుతోంది. అంటే 25 ఏళ్ల క్రితం ఇండస్ట్రాలోకి వచ్చాను. ఇక నా లైఫ్‌ని నేను షిఫ్ట్ చేయాలనుకుంటున్నా. 50 తర్వాత ఏం చేయాలని ఆలోచన వచ్చింది. సక్సెస్‌లు వచ్చాయి.. ఎదిగాం.. ఇక పేరు, డబ్బు సక్సెస్‌తో పాటు వస్తుంటాయి. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ మళ్లీ పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. మన కోసం బతుకుతాం.. మన కోసం సంపాదించుకుంటాం.. తరువాత ఏంటని ఆలోచిస్తుంటే.. నాకు లైఫ్‌లో రిటర్న్ చేయాలనిపించింది. చేయాలని ఈ మధ్యే నాకు అనిపిస్తోంది. సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నా.

నాకు మీలో ఎవరైనా చేయూతనిస్తే మీడియా పరంగా చాలా బాగుంటుంది. అయితే పబ్లిసిటీ పరంగా కాదు. మా దగ్గరకు వచ్చే వాటిలో కొన్ని ఫేక్‌గా ఉండొచ్చు. ప్రాపర్ ప్రాబ్లమ్ ఉన్న దగ్గరికీ మనం రీచ్ అవ్వాలి. మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. జెన్యూన్‌గా అనిపిస్తే నా దగ్గరకు తీసుకొస్తే నేను సాయం చేస్తా. మీలో ఎవరైనా ఇంట్రస్ట్‌గా ఉంటే మాతో జాయిన్ అయితే బాగుంటుంది. నేను ఎడ్యుకేషన్, హెల్త్ కోసం సాయం చేయాలనుకుంటున్నా. ఈ రెండింటినీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. మీలో ఎవరికైనా అవసరం వస్తే నా దగ్గరకు రావొచ్చు. ఇది నా 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.

More News

బిగ్‌బాస్ షో పై త‌మిళ‌నాడు సీఎం సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

సినిమా స్టార్స్‌కి, రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ధ్య మంచి అనుబంధం ఉంటుంది.

వినోదాల విందుగా 'వివాహ భోజనంబు' టీజర్

హాస్య నటుడు సత్య కథానాయకుడిగా నటించిన సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ కథానాయిక. నిర్మాణ సంస్థలు  ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ,

ఈ నెల 24 న వస్తున్న రాంగోపాల్ వర్మ ఫిల్మ్ 'మర్డర్'

అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ,నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్..

కొత్త సంవత్సరంలో విడుదల కాబోతున్న 'బోగ‌న్'

స్టైలిష్ యాక్ట‌ర్ అర‌వింద్ స్వామి, స‌క్సెస్ ఫుల్ హీరో జ‌యం ర‌వి, బ‌బ్లీ బ్యూటీ హన్సిక కాంబినేష‌న్ లో

తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై అల్లు శిరీష్ క్లారిటీ...

త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగనుందంటూ ప్రచారం జోరుగా సాగింది. దీనికి కారణం లేకపోలేదు..