ఆ నలుగుర్ని చంపి.. నేను జైలుకెళ్తా : పూనమ్

  • IndiaGlitz, [Saturday,November 30 2019]

వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఇదే ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకోవడంతో ఇళ్లలోనుంచి బయటికి రావాలంటే మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు డాక్టర్ హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. భారీ భద్రత కట్టుదిట్టం మధ్య పోలీసులు ఆ నలుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. మరోవైపు.. ఎంతో సౌమ్యంగా, పద్ధతిగా ఉండే డాక్టర్ దారుణ హత్యను శంషాబాద్‌ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘వైద్యురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను జైల్లో పెట్టొద్దని.. మాకు అప్పగిస్తే నరకం చూపిస్తాం’ అని ప్రజలు భగ్గుమంటున్నారు. మరోవైపు మహిళా సంఘాలు మాత్రం నలుగురు నేరస్తులను ఎన్‌కౌంటర్‌ చేసి చంపాలని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

చంపి జైలుకెళ్తా..!

కాగా ఈ ఘటనపై ఇదివరకే సోషల్ మీడియా వేదికగా స్పందించిన టాలీవుడ్ నటి పూనమ్ కౌర్.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వీడియో విడుదల చేసిన ఆమె తీవ్ర ఆగ్రహావాశాలకు లోనైంది. ‘ఇలాంటి జంతువులను చంపడానికైనా నేను సిద్ధమే. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన క్రూరులు జైలు శిక్ష అనుభవించడం కాదు.. వాళ్లను చంపి నేను జైలుకెళతాను. నిందితుల్లో ఒకరి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మతం సమస్య కానేకాదు. అడవుల్లో అయినా కాస్త మేలేమో.. కానీ ఈ జనారణ్యంలోనే మనుషులు అతిభయంకరంగా ఉన్నారు. ఇలాంటి సమస్యకు పరిష్కారాలు ఆలోచించాలే తప్ప రాజకీయాలు చేయాలని చూడొద్దు’ అని పూనమ్ కౌర్ తన ఫేస్‌బుక్ వీడియోలో చెప్పుకొచ్చింది. కాగా పూనమ్ వీడియోకు నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

More News

వైఎస్, చంద్రబాబు లాగా కేసీఆర్‌ శిక్షించలేకపోతున్నారేం!?

దివంగత ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాల్లో పెద్దాయనగా పిలుచుకునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల పాలన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

మ‌హిళ కాళ్ల‌కు మొక్కిన అమితాబ్ .. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ అంటే అంద‌రికీ గౌర‌వ‌మే.

మహబూబ్‌నగర్ జైలుకు వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య కేసు నిందితులు

వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'చీమ - ప్రేమ మధ్యలో భామ!' ఆడియో లాంచ్‌

సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది!

దుమ్ము రేపుతున్న 'దర్బార్'లో 'దుమ్ము ధూళి' పాట - పాటల రచయిత అనంత శ్రీరామ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా 'గజిని', 'స్టాలిన్', 'తుపాకీ' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో