బిగ్‌బాస్‌కు నేను వెళ్లట్లేదు.. నా పేరు వాడొద్దు!

  • IndiaGlitz, [Tuesday,June 25 2019]

తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్‌బాస్’ షో.. త్వరలోనే మూడవ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో ఇప్పటికే ప్రోమోను నిర్వాహకులైన ‘మా’ యాజమాన్యం రిలీజ్ చేసింది. అయితే ఇప్పటికే వ్యాఖ్యత ఎవరో.. కంటెస్టెంట్లు ఎవరు అనేదానిపై కాసింత క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో కొన్ని వెబ్‌సైట్లు మాత్రం కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఫలానా నటి.. ఫలానా యాంకర్.. ఫలానా నటులు బిగ్‌బాస్‌కు వెళ్తున్నారంటూ పెద్ద పెద్ద కథనాలే అల్లేస్తున్నారు.

తాజాగా.. టాలీ, బాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల పేరు తెరపైకి వచ్చింది. ఈమె పార్టిసిపెంట్‌గా వెళ్తున్నారని కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈ పుకార్లపై ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. బిగ్‌బాస్ లో నేను పాల్గొంటున్నానన్నది రూమరే. మీరు రాస్తున్న వార్తల్లో 0% కూడా వాస్తవం లేదు. మీ పట్లిసిటీ కోసం నా పేరును దయచేసి వాడుకోవద్దు అని దండంపెడుతున్న ఎమోజీని తన ట్వీట్‌కు యాడ్ చేసింది ధూళిపాళ్ల. కాగా.. శోభిత ధూళిపాళ్ల ఇటీవలే అడవి శేష్‌ హీరోగా రూపొందిన ‘గూఢచారి’ సినిమాలో మెరిసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. అధికారికంగా వెల్లడికాకపోయినప్పటికీ కొన్ని పేర్లు మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే గుత్తా జ్వాల, సింగర్ హేమచంద్రతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ పార్టిసిపేషన్‌పై పెదవి విప్పిన విషయం విదితమే.