అభిమానులను నిరాశ పరచను:  య‌శ్‌

  • IndiaGlitz, [Saturday,June 13 2020]

‘బాహుబ‌లి’తో ద‌క్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ వెంట‌నే విడుద‌లైన క‌న్న‌డ చిత్రం ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1’ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ అయ్యింది. య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. తొలి భాగం సక్సెస్ కావడంతో పెరిగిన అంచనాలకు ధీటుగా రెండో భాగం తెరకెక్కుతోంది. బాలీవుడ్ తారలు సంజయ్ దత్, రవీనాటాండన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అక్టోబర్ 23న సినిమాను విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. ఓ ద‌శ‌లో సినిమాను డిజిట‌ల్‌లోనే విడుద‌ల చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేద‌ని నిర్మాత‌లు ఇది వ‌ర‌కే క్లారిటీ ఇచ్చారు. సినిమా 20 రోజుల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంద‌ని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని జూలైలో చిత్రీక‌ర‌ణ‌కు ప‌ర్మిష‌న్ దొరికినా సినిమాను అక్టోబ‌ర్‌లోనే విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యంపై హీరో య‌శ్ కూడా స్పందించారు. ‘‘పార్ట్ వ‌న్ పెద్ద విజ‌యం సాధించ‌డంతో అభిమానులు సినిమాపై భారీ అంచనాలు ఎర్ప‌రుచుకున్నారు. వారి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే సినిమా ఉంటుంది. వారిని నిరాశ ప‌ర‌చ‌ను. సినిమాను భారీ స్క్రీన్‌పై చూసేలా రూపొందిస్తున్నాం. ముందుగా సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయం’’ అన్నారు.

More News

మ‌హేశ్ రిస్క్ చేయాల‌నుకోవడం లేదా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఈ ఏడాదితో ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో సూప‌ర్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే.

స్టూడియోల కోసం చిరు, బాల‌య్య పోటీ..?

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో చిరంజీవి, బాల‌కృష్ణ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంటాయి.

క్రేజీ కాంబినేష‌న్.. నిజ‌మెంత‌?

కొన్ని కాంబినేష‌న్స్ పేర్లు విన‌గానే అంద‌రిలో సినిమా ఎలా ఉంటుంది? , ఎప్పుడు ఉంటుంది?, అస‌లు ఈ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందా?

మల్లేశ్వరి బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి.

డిజిటల్ ద్వారా అల్లరోడి సినిమా..!

అల్ల‌రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటిత‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు సంపాదించుకుని యాబై సినిమాల‌ను పూర్తి చేశాడు అల్ల‌రి న‌రేశ్‌.