'ఇద్దరి మధ్య 18' రేపే విడుదల

  • IndiaGlitz, [Thursday,April 20 2017]

ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధానపాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించిన మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం 'ఇద్దరి మధ్య 18'. ఈ చిత్రం ఏప్రిల్ 21న (రేపు) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ని ఏర్పాటు చేసింది.

ఈ కార్యక్రమాల్లో ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..'' ఇద్దరి మధ్య 18'' చిత్రం మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌ మూవీ. చిత్రం అంతా అద్భుతంగా వచ్చింది. తెలంగాణ మంత్రి వర్యులు హరీష్‌రావుగారు సినిమా చూసి..మంచి మెసేజ్‌ ఇస్తున్నారని మమ్మల్ని అభినందించడం ఎంతగానో ఆనందాన్నిచ్చింది. అన్ని హంగులతో రేపు ఏప్రిల్ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాము. ప్రేక్షకులు ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..'' అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న మల్కాపురం శివకుమార్, దర్శకుడు నాని ఆచార్య, హీరో రామ్ కార్తీక్, హీరోయిన్ భానుత్రిపాత్రి తదితరులు సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.

రాంకార్తీక్‌, భానుత్రిపాత్రి, బిత్తిరిసత్తి, రవిప్రకాష్‌, శివన్నారాయణ, బాబీలహరి, రఘు, రాము, అప్పారావు, చిట్టిబాబు, చమ్మక్‌చంద్ర మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, ఎడిటింగ్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కెమెరా: జి.ఎల్‌.బాబు, కొరియోగ్రఫీ: నిక్సన్‌ డిక్రూజ్‌, భాను, గణేష్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, పాటలు: కందికొండ, వరికుప్పల యాదిగిరి, రామ్‌ పైడిశెట్టి, చిలుకరెక్క గణేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శివకుమార్‌, కో-డైరెక్టర్‌: జి.భూపతి, సమర్పణ: సాయితేజ పాటిల్‌, నిర్మాత: శివరాజ్‌ పాటిల్‌, స్టోరీ-డైరెక్షన్‌: నాని ఆచార్య.

More News

రాజ్ తరుణ్ డేట్స్ కేటాయిస్తున్నాడు...

రీసెంట్ గా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాతో సక్సెస్ కొట్టిన యంగ్ హీరో రాజ్ తరుణ్,

'ఏంజెల్ ' టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో

'సాయి..నీ...లీలలు' ప్రారంభం

దేవుళ్ల పాత్రల్లో ఒదిగిపోయే నటులు విజయ్ చందర్.ఇప్పటివరకూ ఎన్నో భక్తి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.

ఆత్మ పాత్రలో సమంత...

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు కాబోయే మామ అక్కినేని నాగార్జునతో కలిసి `రాజుగారి గది2` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ 'సాహో' ఫస్ట్ లుక్ రిలీజ్ క్యాన్సిలా...

యంగ్ రెబల్ స్టార్ `బాహుబలి 2` ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ తన తదుపరి సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.