close
Choose your channels

వైసీపీ ఓడితే ఎంపీలంతా రాజీనామా చేస్తారు: పెద్దిరెడ్డి

Monday, April 12, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాల్‌ను మంత్రి పెద్దిరెడ్డి స్వీకరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మేము చాలా ధైర్యంగా ప్రజల ముందుకెళ్లి ఓట్లు అడగటానికి సీఎం జగన్ చేసిన ప్రజాహిత కార్యక్రమాలే మాకు ఆయుధాలు. మొదట అనుకున్నట్టు 14వ తేదీ నిర్వహించాల్సిన బహిరంగ సభను కోవిడ్ కారణంగా వాయిదా వేశాం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మాకు సవాల్ విసురుతున్నారు. మేము గెలిస్తే మీరు రాజీనామా చేయండి. ఒకవేళ ఓడిపోతే వైసీపీ ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. టీడీపీ ఓడితే ముగ్గురు ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయిస్తారా?’’ అని ప్రశ్నించారు.

పవన్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్..

రాత్రి వేళల్లో విగ్రహాలు పగులగొట్టి.. పగలు వెళ్లి వైసీపీని నిందిస్తున్నారు. ఇలాంటి పనులతో మతపరమైన ఘర్షణలు రేపుతున్నారు. బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ ముగ్గురూ ఈ తిరుపతిలోనే ఒకే వేదికపై కూర్చొని ప్రత్యేక హోదా విషయమై ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. పవన్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్. బీజేపీ గురించి 2019 ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాడో మీకు తెలుసు. ఈ రోజు ఆయనకు పాచిపోయిన లడ్డూలు తాజాగా కనిపిస్తున్నాయి. ముగ్గురూ కూడా లోపాయికారి ఒప్పందంతోనే నడుస్తున్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసింది? మన రాష్ట్రానికి బీజేపీ ఇన్‌చార్జిగా సునీల్ దేవ్‌ధర్ ఉన్నారు. ఆయనేం మాట్లాడుతున్నాడో అర్థం కాదు.

చంద్రబాబుకు ఆ సమయం లేదా?

థియేటర్ల వద్ద షో లేనప్పుడు వెళ్లి అక్కడంతా వీడియో తీసుకొచ్చి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని దేవధర్ మాట్లాడతాడు. ఆయన ఏ విధంగా దిగజారి మాట్లాడుతున్నాడో ఓటర్లు గుర్తించాలి. కేంద్రం అన్ని ధరలూ పెంచితే కేంద్రాన్ని ప్రశ్నించే సమయం చంద్రబాబుకు లేదా? ప్రత్యేక హోదా, ప్యాకేజీల గురించి మాట్లాడకుండా.. ఇవాళ హోదా సాధిస్తామంటున్నారు. ఎన్నికల్లో దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. పవన్ ఎన్నికల ముందేమో.. టీడీపీకి మద్దతిచ్చాడు. ఇవాళేమో.. బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. పవన్‌కు ఒంటరిగా పోటీ చేసే సంస్కృతి లేదు. మా 22 మంది ఎంపీల పెర్ఫార్మెన్స్ లోక్‌సభలో ఎలా ఉంది? ఎన్ని సార్లు ప్రత్యేక హోదా గురించి మాట్లాడరనేది గమనించే సమయం చంద్రబాబుకు లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.