కేసు వెనక్కి తీసుకున్న ఇళయరాజా..!
చెన్నై ప్రసాద్ స్టూడియో అధినేతలపై పెట్టికేసుని వెనక్కి తీసుకున్నారు ఇసైజ్ఞాని ఇళయరాజా . సాలిగ్రామంలోని ప్రసాద్ స్టూడియోస్‌ను ఖాళీ చేయాలంటూ స్టూడియో అధినేతలు ఇళయరాజా కోరారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి హైకోర్టు వరకు చేరింది. ప్రసాద్ స్టూడియోస్‌లోకి అనుమతించలేదు. దీంతో ఇళయరాజా హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో ప్రసాద్ స్టూడియోస్ అధినేతలు కూడా ఇళయరాజాపై కేసు వేశారు. కేసుని పరిశీలించిన న్యాయమూర్తి.. ఇళయరాజాను ఓ రోజు ధ్యానం చేసుకోవడానికి స్టూడియోలోకి ఎందుకు అనుమతించడం లేదంటూ ప్రశ్నించారు. అందుకు ఇళయరాజా తమపై కేసు వేశారని స్టూడియో తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఇళయరాజా తరపు న్యాయవాదిని న్యాయమూర్తిని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ఇళయరాజా లాయర్.. ప్రసాద్ ల్యాబ్స్ అధినేతలపై కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే కోర్టు కూడా ఇళయరాజాకు అనుకూలంగా.. స్టూడియోలో ప్రవేశం కల్పించాలని చెప్పింది. ఆయన గదిలో వర్క్ చేసుకోవడానికి అనుమతించాలని ప్రసాద్ స్టూడియో అధినేతలకు ఆదేశాలిచ్చింది. అలాగే ప్రసాద్ స్టూడియోస్‌లోని సదరు గదిలో ఇళయరాజా పనిచేసుకోవచ్చు కానీ.. దానిపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవని చెప్పింది కోర్టు.