జాకీచాన్ తో క‌ల‌సి న‌టిస్తున్న హీరోయిన్..?

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

యాక్షన్ మూవీస్ తో ఆక‌ట్టుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ జాకీచాన్. ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం కుంగ్ ఫూ యోగ‌. ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో సోనూ సూద్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దుబాయ్ లో జాకీచాన్, సోనూసూద్ ల‌పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ విష‌యానికి వ‌స్తే...తెలుగులో ఎన్నోవిజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఇలియానాని జాకీచాన్ స‌ర‌స‌న హీరోయిన్ గా ఎంపిక చేసార‌ని బాలీవుడ్ స‌మాచారం. గ‌తంలో ద మిత్ చిత్రంలో జాకీచాన్ స‌ర‌స‌న మ‌ల్లికా శెరావ‌త్ న‌టించారు. క‌నుక జాకీచాన్ మూవీలో ఇలియానా న‌టించ‌డం నిజ‌మైతే... జాకీచాన్ తో న‌టించిన రెండో భార‌తీయ న‌టిగా క్రెడిట్ ఇలియానాకే ద‌క్కుతుంది.

More News

చిరు ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు..?

మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సునీల్ క్రిష్ణాష్ట‌మి రిలీజ్ ఎప్పుడు..?

అందాల రాముడు, పూల రంగ‌డు,మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. కొంత గ్యాప్ త‌రువాత సునీల్ హీరోగా న‌టించిన చిత్రం క్రిష్ణాష్ట‌మి.

షామిలీ రీ ఎంట్రీ..?

బేబి షామిలీగా చిన్న‌ప్పుడు బాగా పాపుల‌ర్ అయిన షామిలీ ఓయ్ చిత్రంతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది.

బ‌న్ని ఈ సారైనా క‌చ్చితంగా వ‌స్తాడా?

క‌థానాయ‌కుడు పాత్ర‌ల్లో న‌టించిన రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌తో 50 కోట్ల క్ల‌బ్‌లోకి చేరాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఈ కేట‌గిరిలో హ్యాట్రిక్ కొట్ట‌డానికి సిన్సియ‌ర్‌గా ట్రై చేస్తున్నాడు బ‌న్ని.

న‌య‌న‌'తార(క‌) మంత్రం'

తెలుగులో న‌య‌న‌తార జోష్ ఈ మ‌ధ్య‌కాలంలో బాగా త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే త‌మిళంలో మాత్రం ఆమె హ‌వా మాములుగా లేదు.