ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే..?

  • IndiaGlitz, [Thursday,March 31 2022]

ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి 8 మంది ఐఏఎస్‌లకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. ఈ ఐఏఎస్‌ల అధికారుల్లో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌, రాజశేఖర్‌, చినవీరభద్రుడు, జె.శ్యామలరావు తదితరులున్నారు. దీంతో ఈ ఎనిమిది మంది ఐఏఎస్‌లు హైకోర్టును క్షమాపణలు కోరారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం జైలు శిక్ష తప్పించి సేవా కార్యక్రమాలకు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో నెలలో ఒక రోజు వెళ్లి సేవ, ఏడాది పాటు హాస్టళ్లలో సేవా కార్యక్రమం చేపట్టాలని తెలిపింది. దీంతో పాటు ఒక రోజు కోర్టు ఖర్చులు భరించాలని ఆదేశించింది.

కాగా.. గతేడాది సెప్టెంబర్‌లోనూ నలుగురు ఐఏఎస్‌ అధికారులు రావత్, ముత్యాలరాజు, శేషగిరిరావు, మన్మోహన్‌ సింగ్‌లకు హైకోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. 2015లో భూమి వ్యవహారంలో నష్టపరిహారం చెల్లించమని తాము ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయనందున ఈ శిక్షలను విధిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ముత్యాలరాజుకు రెండు వారాల జైలు, వేయి రూపాయల జరిమానా, ఏఎస్ రావత్ కు నెలరోజుల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండువారాల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు రెండువారాల జైలు శిక్ష వేయిరూపాయల జరిమానాను ధర్మాసనం విధించింది. అలాగే బాధిత మహిళకు లక్షరూపాయలను ప్రభుత్వ నిధి నుంచి కాకుండా అధికారుల సొంత డబ్బులను చెల్లించాలని తీర్పునిచ్చిన వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది.

More News

రాజ‌కీయాల‌లోకి అనవసరంగా వెళ్లా.. తాప్సీతో ఛాన్స్ మిస్ అయ్యా: చిరు హాట్ కామెంట్స్

అప్పట్లో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అందం, అభినయంతో ఆకట్టుకున్న తాప్సీ పన్ను  తర్వాత బాలీవుడ్ చెక్కేసిన సంగతి తెలిసిందే.

‘‘ది కశ్మీర్ ఫైల్స్’’ రగడ : కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి, సీఎం హత్యకు కుట్రపన్నారన్న ఆప్

'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే..

ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం.. ఏప్రిల్ 4 నుంచి పాలన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ‘‘ఉగాది’’ కానుక.... డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ , ఎంతంటే..?

ఉగాది పర్వదినానికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. కరవు భత్యం (డీఏ) 3 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది.

ప్రతిష్టాత్మక పురస్కారం పొందిన రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల

సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.