స‌హ‌జ‌న‌టి పాత్ర‌లో...

  • IndiaGlitz, [Sunday,November 25 2018]

ప్ర‌స్తుతం ఉన్న సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటూ రోజుకోరీతిలో వార్త‌ల్లో నిలుస్తున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇది. 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా సినిమా రూపొందుతోంది.

అందులో తొలి పార్ట్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. క‌థానాయ‌కుడు పార్ట్‌లో ఎన్టీఆర్ హీరోగా విజ‌య‌వంతం సాధించిన చిత్రాల్లో కొన్ని స‌న్నివేశాల‌ను పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

అల‌నాటి తార‌లంద‌రినీ నేటి త‌రం తార‌ల‌తో రీప్లేస్ చేస్తూ సినిమాకు గ్లామ‌ర్ తెచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ర‌కుల్‌, త‌మ‌న్నా, అనుష్క‌, మాళ‌వికా నాయ‌ర్ ఇలా తారలంద‌రూ ఈ చిత్రంలో మెర‌వ‌నున్నారు. తాజాగా ఈ చిత్రంలో 'ఆర్‌.ఎక్స్ 100' ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా న‌టించ‌నున్నారు.

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ పాత్ర‌లో పాయ‌ల్ న‌టిస్తుంది. సినిమా టీజ‌ర్‌ను డిసెంబ‌ర్ 2న విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. ఈ సినిమా ఆడియో డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో జ‌ర‌గ‌నుంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. 

More News

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు అంబ‌రీష్(66)అనారోగ్యంతో క‌న్నుమూశారు.

అద్నాన్ స‌మీ 'ఇష్టంగా' పాడిన పాట విడుద‌ల‌!

ఇంతందంగా పాడాలంటే అందుకు అంతే ఇంపైన గాత్రం కావాలి. అలాంటి ప్రేమ‌గీతానికి ప్ర‌ఖ్యాత గాయ‌కుడు అద్నాన్ స‌మీ పాడాలంటే..? ఆయ‌న్ని ఒప్పించ‌డం అంత సులువా?

డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌కు సిద్ద‌మైన సుబ్ర‌మ‌ణ్య‌పురం

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా,  సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై  బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో

'టాక్సీవాల' సక్సెస్ కి తెలుగు ప్రేక్షకుల ధన్యవాదాలు - నిర్మాత ఎస్‌కెఎన్

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో

పెళ్లి చేసుకున్న విల‌న్‌...

తెలుగు, త‌మిళ భాష‌ల్లో విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు హ‌రీష్ ఉత్త‌మ‌న్‌.