close
Choose your channels

ప్రభుదేవా సాంగ్‌ రీమిక్స్‌లో... 

Wednesday, August 8, 2018 • తెలుగు Comments

ప్రభుదేవా సాంగ్‌ రీమిక్స్‌లో... 

శంకర్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం 'ప్రేమికుడు'. 1994లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఊర్వశి ఊర్వశి...' అనే పాట యూత్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఈ పాటకు రీమిక్స్‌ను చేస్తున్నారు. బాలీవుడ్‌లో రూపొందుతోన్న అర్జున్‌రెడ్డి చిత్రంలో ఈ రీమిక్స్‌ సాంగ్‌ ఉంటుంది.

ఈ సాంగ్‌ కోసం యో యో హనీసింగ్‌ సింగ్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ఈ స్పెషల్‌ రీమిక్స్‌లో కియరా నర్తించనుంది. సంజయ్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. 'నాకు ప్రభుదేవాగారంటే అంటే చాలా ఇష్టం. షాహిద్‌ చాలా మంచి డాన్సర్‌. ఆయనతో పోటీ పడి డాన్స్‌ చేయాలంటే కష్టమే.

కానీ ప్రయత్నిసాను' అని కియరా అన్నారు. ఇప్పుడు కియరా తెలుగులో రామ్‌చరణ్‌ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో విజయ్‌ సినిమా కోసం దర్శక నిర్మాతలు ఆమెను అప్రోచ్‌ అవుతున్నారు.