close
Choose your channels

సీమ నేప‌థ్యంలో....

Saturday, September 1, 2018 • తెలుగు Comments

సీమ నేప‌థ్యంలో....

ద‌ర్శ‌క నిర్మాత‌గా ఆఫీస‌ర్ చాలా ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయాడు. అయితే తాజాగా ఆయ‌న నిర్మాణంలో రూపొందుతున్న 'భైర‌వ గీత' సినిమాలో బిజీగా ఉన్నాడు.

రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే ఎమోష‌న‌ల్ రా ల‌వ్‌స్టోరీగా సినిమా రూపొందుతుంది. రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ల నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థ ఎలాంటిదో భైర‌వ‌గీత చూడాల్సిందే. ధ‌నుంజ‌య‌, ఇర్రా జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి టి.సిద్ధార్థ ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్ చూస్తే వ‌ర్మ మార్కు సినిమాలా క‌న‌ప‌డుతుంది.

అలాగే సినిమాలో లిప్‌లాకింగ్‌లు కూడా ఉన్నాయి. వాళ్ల ర‌క్తంతో సీమ‌కు అభిషేకం చేద్దాం..,ఎవ‌రినీ ఇడిసిపెట్టొద్దు.. ఏడిపిద్దాం.. ఒక్కొక్క‌ర్ని సంటిపిల్ల‌ల్లా గుక్క‌పెట్టి ఏడ్చేలా చేద్దాం అనే డైలాగులు సినిమా ఎలాంటి కాన్సెప్ట్‌తో సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.