కేక పెట్టించేలా ప్రియదర్శి, నందిని రాయ్ 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' టీజర్


Send us your feedback to audioarticles@vaarta.com


కమెడియన్ గా ప్రియదర్శి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండుకు తగ్గట్లుగా కామెడీ పంచ్ లు పేల్చుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాగని ప్రియదర్శి పూర్తిగా కామెడీ ఇమేజ్ తోనే సరిపెట్టుకోవడం లేదు. అవకాశం చిక్కినప్పుడు విభిన్నమైన రోల్స్ కూడా చేస్తున్నాడు. అందుకు ఉదాహరణే మల్లేశం చిత్రం.
ఇప్పుడు మరో బోల్డ్ అటెంప్ట్ తో ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అవుతున్నాడు ప్రియదర్శి. ఆహా వేదికగా 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి, బిగ్ బాస్ భామ నందిని రాయ్ లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. బోల్డ్ కంటెంట్, క్రైమ్ సీన్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలయింది.
ఇదీ చదవండి: పవన్ సినిమాలో బాలీవుడ్ హీరో, హీరోయిన్.. ఎంట్రీ ఎప్పుడంటే ?
ఆశ్చర్యపరిచే విధంగా ఇందులో ప్రియదర్శి పాత్ర ఉంది. ప్రియదర్శి పాత్ర ఎమోషనల్ గా ఉంటూనే భీకరమైన పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు. ఇక నందిని రాయ్ కూడా అటు గ్లామర్ సీన్లు, ఇటు క్రైమ్ సీన్లలో అదరగొడుతోంది. జగపతి బాబు వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ టీజర్ సూపర్బ్ అనే చెప్పాలి.
ఈ వెబ్ సిరీస్ కు విద్యాసాగర్ దర్శకుడు. త్వరలో ఈ వెబ్ సిరీస్ ని విడుదల చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments