భారత్‌ను బెంబేలెత్తిస్తున్న కరోనా మూడో అవతారం

  • IndiaGlitz, [Thursday,April 22 2021]

ఓవైపు డబుల్‌ మ్యూటెంట్‌ (రెండు ఉత్పరివర్తనాలు చెందింది) వైరస్‌ వల్లనే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగా రోజులు కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. దేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దీనికి అల్లాడుతుంటే.. మూడు ఉత్పరివర్తనాలు (ట్రిపుల్‌ మ్యూటెంట్‌) చెందిన మరో కొత్త రకం వైరస్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే.. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ట్రిపుల్ మ్యూటెంట్‌ను పరిశోధకులు గుర్తించారు.

కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ట్రిపుల్‌ మ్యూటెంట్‌ వైర్‌స్‌ను పరిశోధకులు కనుగొన్నట్టు సమాచారం. మొదట ఈ మ్యూటెంట్‌ను బెంగాల్‌లో గుర్తించినట్టుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయోలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు. ఈ ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్‌ మరింత వేగంగా వ్యాపిస్తుందని మెక్‌గిల్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మధుకర్‌ పాయ్‌ సైతం వెల్లడించారు. అత్యధికులు ఈ వైరస్ బారిన పడతారని తెలిపారు. అయితే ఈ వైరస్‌ జన్యు క్రమాన్ని వేగంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా వైరస్‌లో మార్పులకు అనుగుణంగా వ్యాక్సిన్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రొఫెసర్‌ పాయ్‌ వెల్లడించారు.

మన దేశంలో ఒక శాతం కంటే తక్కువ కేసుల్లోనే జన్యు క్రమ అధ్యయనాలు జరుగుతున్నందువల్ల కొత్త వైరస్‌ రూపాలను కనుక్కోవడం సవాలుగా మారిందని ఆయన తెలిపారు. ట్రిపుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌ వ్యాప్తిని, తీవ్రతను అంచనా వేయాలంటే మరిన్ని జన్యు విశ్లేషణలు అవసరమని చెప్పారు. అలాగే ఈ ట్రిపుల్ మ్యూటెంట్ కేసుల్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే తప్ప ఎంత హానికరమో చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త కేసులు పెరగడానికి కూడా వైరస్‌ ఉత్పరివర్తనాలే కారణమని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి కరోనా ఈ మూడో అవతారం భారత్‌ను బెంబేలెత్తిస్తోంది.

More News

ఆ మలయాళీ స్టార్ కపుల్.. తెలుగులో బిజీబిజీ

తెలుగు సినిమాల్లో చేసేందుకు అన్ని ఇండస్ట్రీల వారూ చాలా ఇష్టపడుతుంటారు. తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా సరే త్వరగా ఓన్ చేసుకుంటారు.

'పంచతంత్రం'లో లేఖ పాత్రలో శివాత్మిక రాజశేఖర్... పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా

అడివి శేష్ చేతుల మీదగా 'పంచతంత్రం' టైటిల్ పోస్టర్, నటీనటుల వివరాలు విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. ప్రపంచంలో ఇదే తొలిసారి

కరోనా మహమ్మారి దేశంలో ఊహించని విధంగా విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్(34) కరోనాతో కన్నుమూశారు.