భారత్‌లో 23వేలు దాటిన కేసులు.. 24 గంటల్లో కొత్తగా..

భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23వేలు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం నాడు కేసులకు సంబంధించి ఎంసీడీసీ డైరెక్టర్ సుజిత్ కుమార్ సింగ్ మీడియా ముందుకొచ్చి ఈ విషయాలను వెల్లడించారు. దేశంలో 23,077 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితుల రికవరీ 20.57శాతం ఉంది. గత 14రోజుల్లో 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు నమోదుకాలేదు. దేశంలో ప్రస్తుతం 17,610 కరోనా యాక్టివ్‌ కేసులు. కరోనా నియంత్రణకు మరో 4 ఐఎంసీటీ బృందాలు ఏర్పాటు చేశాం. హైదరాబాద్, సూరత్, అహ్మదాబాద్, చెన్నైలకు నాలుగు ప్రత్యేక బృందాలు పంపుతున్నాం. ఇప్పటి వరకూ 5లక్షలకు పైగా కరోనా టెస్ట్‌లు చేశాం. గత 24 గంటల్లో కొత్తగా 1684 కేసులు నమోదయ్యాయి’ అని సుజిత్ కుమార్ తెలిపారు. కాగా దీన్ని బట్టి చూస్తే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.. అదే విధంగా రికవరీ రేటింగ్ కూడా పెరుగుతోందని చెప్పుకోవచ్చు

ప్రతి 9రోజుల కోసారి..

‘గత 24 గంటల్లో 491 మంది కోలుకున్నారు. ఇప్పటి దాకా నాలుగువేల మంది కరోనాను జయించారు. కరోనా మూడో దశ నుంచి భారత్ రక్షించబడింది. నాన్ హాట్ స్పాట్ ఏరియాల్లో తాత్కాలిక మినహాయింపులు ఉంటాయి. ప్రతి 9 రోజులకొకసారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఉపయోగపడింది. కమ్యూనిటీ వ్యాప్తిని నిరోధించడానికి జిల్లా స్థాయిలో పటిష్టంగా నిఘా అమలు చేస్తున్నాం. జిల్లాల్లో 9.45 లక్షల మంది కరోనా అనుమానితులపై నిఘా పెట్టాం’ అని సుజిత్ వెల్లడించారు.

ఆరోగ్య శాఖా మంత్రి అసంతృప్తి

ఇదిలా ఉంటే.. రాష్ట్రాల మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాసిరకం టెస్ట్ కిట్లను వెనక్కి పంపిస్తామని తెలిపారు. చైనా కంపెనీలకు టెస్ట్ కిట్ల డబ్బులు చెల్లించేది లేదన్నారు. రాష్ట్రాలకు సహకరించడం కోసమే కేంద్రం ఏర్పాటు చేసిన బృందాలు సహకరిస్తాయన్నారు. లాక్ డౌన్ చాలా రాష్ట్రాల్లో సరిగ్గా అమలు చేయటం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరదేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. అంతేకాదు.. కరోనా పాజిటివ్ రివకరీ రేటు మన దేశంలో బాగుందని మంత్రి తెలిపారు.

More News

మ‌హేశ్ హెడ్ మ‌సాజ్‌.. చేసిందెవ‌రంటే?

క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల నెల‌కున్న లాక్‌డౌన్ కార‌ణంగా సినీ సెల‌బ్రిటీలంద‌రూ ఇంటి ప‌ట్టునే ఉంటున్నారు. అంద‌రూ కుటుంబ స‌భ్యుల‌తో వారి విలువైన స‌మ‌యాన్ని గడుపుతున్నారు.

బాల‌య్య 107 ముహూర్తం కుదిరిందా?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక మునుపే ఆయ‌న త‌న

అభిమానుల‌కు షాకిచ్చిన రౌడీ హీరో!

ప్రస్తుతం ఇంట్లో తనను మగాడిలా చూడటం లేదని వాపోతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియ‌ల్ మేన్ అనే ఛాలెంజ్ మాంచి ట్రెండ్‌లో ఉంది.

రాజ‌మౌళిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ద‌ర్శ‌కుడు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.. ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు పేరిది. ఈ స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌స్తుతం తార‌క్‌, చ‌ర‌ణ్‌ల‌తో రౌద్రం ర‌ణం రుధిరం సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

లాక్‌డౌన్ లేడీస్ అంటూ వితవుట్ మేకప్‌తో. మెగా లేడీస్‌

మెగాస్టార్ చిరంజీవి క‌రోనా క్రైసిస్ ఛారిటీ మ‌న‌కోసం ద్వారా సినీ కార్మికుల క‌ష్టాల‌ను తీరుస్తున్నారు. అలాగే ర‌క్త‌దానం చేయ‌మ‌ని త‌న అభిమానుల‌కు పిలుపు నిచ్చారు. అయితే ఈ ప‌నుల‌ను