దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే..

  • IndiaGlitz, [Saturday,May 01 2021]

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కేసుల సంఖ్యే కాదు.. మరణాల సంఖ్య సైతం భారీగానే ఉండటం గమనార్హం. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా నిన్న రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 4 లక్షలకు పైచిలుకు కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచ వ్యాప్తంగా ఒక రోజులో ఈ స్థాయిలో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అలాగే మరణాలు సైతం దారుణంగా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 19,45,299 పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో 4,01,993 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య దాదాపు రెండు కోట్లకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3523 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 2,11,853 మంది మృతి చెందారు. దేశంలో మరణాల రేటు 1.11 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,68,710కి చేరుకోవడం గమనార్హం.

అయితే కోలుకున్న వారి సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉండటం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 3 లక్షల మంది అంటే 2,99,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ 1.56 కోట్ల మంది కరోనా నుంచి ఇప్పటి వరకూ కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 81.84 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల రేటు 17.06 శాతానికి చేరుకుంది. మరోవైపు టీకా కార్యక్రమం కూడా కొనసాగుతూనే ఉంది. శుక్రవరాం 27 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 15.49 కోట్ల మంది టీకా వేయించుకున్నారు.

More News

కరోనాతో టాలీవుడ్ దర్శకుడి మృతి

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ సెకండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో దాదాపు లక్షల్లో కేసులు..

ఈటలపై వేటుకు రంగం సిద్ధం.. సీబీఐతో విచారణ జరిపించాలన్న మంత్రి

ప్రభుత్వ ధిక్కార స్వరానికి త్వరలోనే వేటు పడబోతోందని తెలుస్తోంది. నిజానికి మంత్రులంటే ఎలా ఉండాలి? ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు,

అమెరికా సాయం భారత్‌కు చేరింది: యూఎస్ ఎంబసీ

ప్రస్తుతం భారత్‌లో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అత్యవసరమైన ఆక్సిజన్ కొరతతో పాటు టెస్టింగ్ కిట్లు, పీపీఈ కొట్ల కొరత దేశాన్ని కుదిపేస్తోంది.

మరో తమిళ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

2019లో ధనుష్ ప్రధాన పాత్రలో రూపొంది.. మంచి సక్సెస్ సాధించిన తమిళ చిత్రం 'రాక్షసన్‌'ను

రానా మరో పాన్ ఇండియా సినిమా

'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' - కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి.