close
Choose your channels

21 రోజుల పాటు ఇండియా లాక్‌డౌన్..: మోదీ

Tuesday, March 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

21 రోజుల పాటు ఇండియా లాక్‌డౌన్..: మోదీ

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించిన కేంద్రం.. తాజాగా మరో సంచలన నిర్ణయమే తీసుకుంది. ఇవాళ అనగా మంగళవారం అర్థరాత్రి నుంచి దేశం మొత్తాన్ని సంపూర్ణంగా మూసివేస్తున్నట్లు (లాక్‌డౌన్‌) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మూసివేత అనేది 21 రోజుల పాటు కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అంటే ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందన్న మాట.

నేటి రాత్రి నుంచి సర్వం బంద్

మంగళవారం సాయత్రం 08 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలుకు పలు కీలక సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా చేతులెత్తి నమస్కరిస్తూ పలు విజ్ఞప్తులు కూడా చేశారు. దేశంలోని ప్రజలు ఎక్కడికీ వెళ్లవద్దని, ఏ రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలోనే.. ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలోనే ఉండాలని.. ప్రజల సహకారం ఉంటేనే కరోనా విజయం సాధిస్తామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికీ ఇదే లక్ష్మణ రేఖ!

‘ఏం జరిగినా సరే ఇంటి నుంచి బయటికి రాకూడదు. ఈ అర్ధరాత్రి నుంచి మొత్తం లాక్ డౌన్ చేసేస్తున్నాం. ఇల్లు విడిచి బయటికి రావడం పూర్తిగా నిషేధం. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలి. ఒకరకంగా చెప్పాలంటే జనతా కర్ఫ్యూని మించి ఇది. ప్రతి ఒక్కర్నీ (భారత ప్రజలను) లాక్‌డౌన్ పాటించాలని వేడుకుంటున్నాను. ఈ 21 రోజులు ఇళ్ల నుంచి బయటికి రావొద్దు. ఈ 21 రోజులే చాలా కీలకం. 21 రోజులు ఇళ్లలో ఉండకపోతే.. పరిస్థితి చేయిదాటిపోతుంది. లాక్‌డౌన్ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణ రేఖ’ అని మోదీ చెప్పుకొచ్చారు.

దయచేసి అర్థం చేస్కోండి..!

ఆయన అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరై ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా సవాల్ విసురుతూనే ఉంది. కరోనా వ్యాప్తిని మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కరోనాను అరికట్టాలంటే.. సోషల్ డిస్టెన్సే ఏకైక మార్గం. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. నేను ఈ మాట భారత ప్రధానిగా చెప్పడం లేదు.. మీ ఇంటి సభ్యుడిగా చెబుతున్నాను. దయచేసి ఎవరూ నిబంధనలు ఉల్లంఘించొద్దు. ఒక వ్యక్తి ద్వారా వేల మందికి వైరస్ వ్యాపిస్తుంది. కరోనా నియంత్రణకు గాను రూ. 15 వేల కోట్లు కేటాయిస్తున్నాం’ అని మోదీ కీలక ప్రసంగం చేశారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.