భారత్‌లో 57 లక్షలకు చేరువలో కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 57 లక్షలకు చేరువవుతుండగా.. మరణాల సంఖ్య 90 వేలు దాటింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 9,53,683 పరీక్షలు నిర్వహించగా.. 83,347 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 56,46,011కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1085 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 90 వేలు దాటింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 89,746 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య మొత్తంగా 45,87,613కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 9,68,377 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు 81.25 శాతం ఉండగా.. మరణాల రేటు 1.59 శాతంగా ఉంది. కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,62,79,462 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

More News

'రంగ్‌దే' షూటింగ్ స్టార్ట్..

‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించిన అనంతరం అదే జోష్‌తో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నేతల విషయంలో పాటించలేదనేది పలువురి వాదన. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆదిలోనే కంట్రోల్‌లో పెట్టి ఉండే

బిగ్‌బాస్: వార్ బిగిన్స్.. ఇక బీభత్సమే..

నేటి బిగ్‌బాస్ షో మొత్తం ఫిజికల్ టాస్క్‌తో నడిచింది. రోబోలు, మనుషుల మధ్య వార్ ఆసక్తికరంగా నడిచింది. పోయిన వారం సెల్ఫ్ నామినేట్ అవడంతో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు.

వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్..

వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

విశాల్‌కు హైకోర్టు నోటీసులు

హీరో, నిర్మాత అయిన విశాల్‌ దర్శకుడిగా మారి 'డిటెక్టివ్‌ 2' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.