చంద్రయాన్-2 సక్సెస్.. సత్తా చాటిన భారత్

  • IndiaGlitz, [Monday,July 22 2019]

యావత్ ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ‘చంద్రయాన్‌-2’ ఎట్టకేలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది. సోమవారం మధ్యాహ్నం అనుకున్న టైమ్‌కు సరిగ్గా 2: 43 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్‌-3ఎం1 రాకెట్‌ ద్వారా రివ్వున ఎగిరి జాబిల్లి వైపు దూసుకెళ్లింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ సత్తాను చాటిందని చెప్పుకోవచ్చు. ఈ గ్రాండ్ సక్సెస్‌తో అగ్రదేశాలకు దీటుగా జాబిల్లిపై ఏముందో కనుగొనేందుకు క్రమంలో మరో అడుగులేసినట్లైంది.

కాగా.. ఈ చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను తనతో పాటు నింగిపైకి మోసుకెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు కాగా.. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్‌తో రాకెట్ నింగిలోకి పయనించింది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి మొత్తం రూ. 978 కోట్లు ఖర్చయిందని షార్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయోగం ఇదివరకే జరగాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే ఈ ప్రయోగం సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.

More News

కృష్ణ‌వంశీ 'న‌ట‌సామ్రాట్‌`' ఎవ‌రో తెలుసా?

కృష్ణ‌వంశీ సినిమా `అంతఃపురం`తో నిర్మాత‌గా మారారు న‌టుడు ప్ర‌కాష్‌రాజ్‌. 1999లో డ్యూయ‌ట్ మూవీస్ ప‌తాకంపై ప్ర‌కాష్‌రాజ్ తెర‌కెక్కించిన అంతఃపురం

కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే! - రైటర్ కమ్ హీరో ఆకాష్

కాన్సెప్ట్ పరంగా చాలా కొత్తగా ఉండి.. కొత్తతరం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండడంతో కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' మెయిన్ కాన్సెప్ట్ తనదే అంటున్నారు అందాల కథానాయకుడు, 'ఆనందం' ఫేమ్ ఆకాష్.

స‌మంత `96` లుక్ ఇదే...

స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న `96` తెలుగు రీమేక్ ఇమేజ్ ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

త‌మిళంలోకి తొలిసారి న‌టించ‌నున్న బాలీవుడ్ న‌టుడు

బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుల్లో ప‌రేశ్ రావ‌ల్ ఒక‌రు. ఈయ‌న తెలుగులో శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్ వంటి సినిమాతో పాటు మ‌రికొన్ని చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.

పూరి, చార్మితో గొడ‌వ‌పై రామ్ క్లారిటీ

ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌, డాషింగ్ హీరో పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`