close
Choose your channels

'ఇండియ‌న్ 2' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Tuesday, January 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చింది. ఆ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన వాళ్లు ఎంద‌రో. జైళ్ల‌లోమ‌గ్గిన‌వాళ్లు ఎంద‌రో. అలా స్వాతంత్ర్య కోసం పోరాడిన ఓ సేనాప‌తి.. స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని లంచం క్యాన్స‌ర్‌లా క‌మ్మేసింద‌ని తెలుసుకుని దాన్ని ఎదుర్కొన‌డానికి ఎదురుతిరుగుతాడు.

ఆ క్ర‌మంలో త‌న క‌న్న‌కొడుకు కూడా ఆ క్యాన్స‌ర్‌లో భాగ‌మేన‌ని తెలుసుకుని అత‌న్ని చంప‌డానికి కూడా వెనుకాడ‌డు. .. 22 ఏళ్ల క్రితం ఇదే క‌థ‌తో ఇండియ‌న్ సినిమా విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సేనాప‌తి పాత్ర‌లో క‌మ‌ల్ హాస‌న్ ముస‌లి గెట‌ప్‌లో.. కొడుకు పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'ఇండియ‌న్ 2' రూపొందుతోంది.

ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ క‌మ‌ల్ సేనాప‌తిగా తెర‌పై క‌నిపించునున్నారు. మ‌రి ఈ సారి శంక‌ర్ సినిమాలో ఏ అంశాన్ని ప్ర‌ధానంగా చూపుతారోన‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు శంక‌ర్‌.

ఇందులో క‌మ‌ల్ హాస‌న్ ముఖాన్ని స‌రిగ్గా చూప‌లేదు కానీ.. మ‌ర్మ క‌ళ‌లో వేళ్లు మ‌డ‌త పెట్టే స్టైల్‌ను ప్ర‌ధానంగా ఈ లుక్‌లో చూపించారు. ఈ నెల 18 నుండి సినిమా రెగ్యుర‌ల్ షూటింగ్ జ‌రుగ‌నుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.