close
Choose your channels

ఇండియ‌న్ 2 లొకేష‌న్ మారిందా?

Friday, May 22, 2020 • తెలుగు Comments

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`. 1996లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `ఇండియ‌న్‌`కు ఇది సీక్వెల్. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో ఆగింది. అంత‌కు ముందే జ‌రిగిన క్రేన్ ప్ర‌మాదం వ‌ల్ల కూడా షూటింగ్ ఆగింది. ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య బ‌డ్జెట్ ఎక్కువైందంటూ అదంటూ ఇదంటూ షూటింగ్ ఆగిందంటూ వార్త‌లు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేద‌ని, త్వ‌ర‌లోనే షూటిగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని టాక్‌. అయితే చెన్నైలో క్రేన్ ప్ర‌మాదం జ‌రిగిన స్టూడియోలో కాకుండా బిన్నీ మిల్స్‌లో స్పెష‌ల్ సెట్స్ వేసి చిత్రీక‌ర‌ణ జ‌రప‌బోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ఈ సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్‌, ర‌కుల్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అలాగే చెన్నై టీన‌గ‌ర్‌లోని ఓ భారీ హోట‌ల్‌కి క‌మ‌ల్ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ప్ర‌త్యేక‌మైన సెట్‌లో క‌మ‌ల్‌హాస‌న్‌కు, విల‌న్‌కు మ‌ధ్య ఫైట్‌ను చిత్రీక‌రించారు. మ‌రి మిగిలిన షూటింగ్‌పై శంక‌ర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz