నెక్స్ట్ టార్గెట్ ‘పీవోకే’.. మేం దేనికైనా రెఢీ..!

  • IndiaGlitz, [Thursday,September 12 2019]

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ భారత్‌లో పూర్తిగా అంతర్భాగమైన సంగతి తెలిసిందే. అయితే.. ఇక మిగిలిందల్లా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌‌ (పీవోకే) మాత్రమే. దీని కోసం అటు పాక్ పోరాటం చేస్తుండగా.. భారత్ మాత్రం ఎప్పుడైనా మనదే.. దీనికోసం ఏం చేయడానికి రె‘ఢీ’ అంటోంది. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన ప్రకటన చేశారు. పీవోకేను ఆక్రమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఫైనల్‌గా కేంద్ర ప్రభుత్వమేనని నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బిపిన్ చెప్పుకొచ్చారు.

కశ్మీర్ పరిస్థితులపై..!

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో జరుగుతున్నదంతా తమ మంచి కోసమేనని జమ్మూ కశ్మీర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ ప్రజలు 30 ఏళ్లుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారనీ... ఇకపై అక్కడ శాంతి నెలకొనేలా సహకరించాలని రావత్ ఈ సందర్భంగా కోరారు. శాంతియుత వాతావరణం ఏర్పడితేనే ఇన్నాళ్లూ ఏమి కోల్పోయారన్నది అక్కడి ప్రజలకు అర్థమవుతుందన్నారు.

ఇదిలా ఉంటే.. వాస్తవానికి 370 ఆర్టికల్ రద్దు అయిన రోజే పార్లమెంట్ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పీవోకే కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని ప్రకటించిన విషయం విదితమే. షా ఈ ప్రకటన చేసిన తర్వాత భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రపంచ దేశాల దగ్గర పాక్ కారు కూతలు కూస్తోంది.. అయినప్పటికీ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు... అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో కూడా దాయాది దేశానికి ఊహించని ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. 

More News

‘కారు’కు బ్రేక్‌కు ‘కమలం’ మాస్టర్ ప్లాన్.. అట్టర్‌ప్లాప్!?

తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా మారాలనుకుంటున్న బీజేపీ.. మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తోందా..? ప్రస్తుతానికి ఏపీని కాస్త పక్కనెట్టిన కమలనాథులు.. తెలంగాణలోని ‘కారు’

బాబూ.. పిచ్చి వేషాలు మానుకో.. పప్పులేం ఉడకవ్ : బొత్స

ఆంధ్రపదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమం అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ముఖ్య అతిథులుగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లోనే తొలిసారిగా ‘సైరా’ అనే చారిత్రక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

జగన్ పాలనపై జనసేన రిపోర్ట్ రెడీ.. 14న రిలీజ్!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లను సంపాదించుకున్న వైసీపీ.. ఇటీవలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వందరోజులు పూర్తి చేసుకున్న విషయం విదితమే.

పీవీ సింధును పద్మభూషణ్ వరిస్తుందా!?

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధుకను పద్మభూషణ్ వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.