గుడ్ న్యూస్ : ఈ నెల 12 నుంచి రైళ్లు నడుస్తాయ్..

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కడ చిక్కుకున్న కార్మికులు, విద్యార్థులకు ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఒకింత శుభవార్తే చెప్పింది. ప్రయాణికుల రైళ్లు ప్రారంభమయ్యే తేదీని రైల్వే శాఖ ప్రకటించడం శుభపరిణామం. ఈనెల 12వ తేదీ నుంచి ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. న్యూ ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు మొత్తం 30 సర్వీసులను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కాగా వీటిని స్పెషల్ ట్రైన్లు అని పిలుస్తారు. ఈ రైళ్లు న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడవనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అంటే ఢిల్లీ కేంద్రంగానే రైళ్లన్నీ నడుస్తాయన్న మాట. ఇందుకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రాలేదు. త్వరలోనే వెల్లడిస్తామని రైల్వేశాఖ తెలిపింది.

టికెట్లు బుక్ చేస్కోండి..

అయితే.. ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కాగా.. పరిస్థితిని బట్టి, రైలు బోగీలు అందుబాటులో ఉన్న దాన్ని బట్టి దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైలు సర్వీసులను పునరుద్ధరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే వలస కూలీలను తరలించేందుకు 300 శ్రామిక్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20వేల రైలు కోచ్‌లు కరోనా వైరస్ బాధితుల కోసం ఆస్పత్రులుగా మార్చి చికిత్స అందిస్తున్న విషయం విదితమే.

అన్నీ ఏసీ రైళ్లే..

కాగా ఈ నెల 12 నుంచి నడవనున్న ఈ ప్రత్యేక రైళ్లన్నీ ఏసీ కోచ్‌లతోనే నడుస్తాయని రైల్వే శాఖ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు.. మునుపటిలాగా అన్ని స్టాప్స్‌లో ఆగవని పరిమిత స్టాప్స్‌లో మాత్రమే ఆగుతాయని ప్రకటించింది. అయితే.. టికెట్ ధరలకు మాత్రం రెక్కలొచ్చాయని చెప్పుకోవచ్చు. రాజధాని రైలుతో సమానంగా అన్ని ట్రైన్స్‌కు టికెట్ ధరలు ఉంటాయని తెలిపింది.

వీరికి మాత్రమే..

ఇదిలా ఉంటే.. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని రైల్వేశాఖ ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు.. రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు లేవని తేలితేనే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే సీటింగ్ ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

More News

బాదుడే... బాదుడు.. జగన్ మార్క్ దోపిడీ: లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్ల వర్షం కురిపించారు.

నేడు రెండో పెళ్లి చేసుకోనున్న నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదిక కానుంది.

హైదరాబాదీలు తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల ముందస్తు హెచ్చరిక

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఇప్పటికే మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి. అయితే ఈ లాక్‌డౌన్‌తో ఎలాంటి కూలినాలీ లేక కార్మికులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు రావడం బాధాకరం!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బోన్ క్యాన్సర్‌ బాధపడుతున్నారని రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. అయితే ఈ వార్తల్లో ఏది నిజమో..

పుకార్లు నమ్మొద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా : అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. తనకోసం రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ప్రార్థన చేయాలని గత కొన్ని రెండ్రోజులుగా సోషల్ మీడియాలో..