close
Choose your channels

ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్స్ కాంబోలో సినిమా..!

Monday, April 6, 2020 • తెలుగు Comments

ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్స్ కాంబోలో సినిమా..!

ఒక సూప‌ర్‌స్టార్‌ను ఒప్పించి సినిమా తీయ‌డ‌మంట‌నేనే గ‌గ‌న‌మైపోతున్న ఈరోజుల్లో ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్స్‌తో ఓ ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. విన‌డానికే ఈ వార్త ఆశ్చ‌ర్య‌క‌రంగా అనిపిస్తుంది. అయితే అది నిజం..కానీ ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. తెర‌కెక్క‌బోయే సినిమా ఫీచ‌ర్ ఫిలిం కాదు.. షార్ట్ ఫిలిమ్‌. అయితే ఇంత మంది సూప‌ర్‌స్టార్స్‌ను ముందుకొచ్చేలా చేసిన ఘ‌న‌త మాత్రం క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19)కి ద‌క్కింది.

వివ‌రాల్లోకెళ్తే... క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. లాక్ డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ ప్ర‌ముఖులు ప్ర‌జ‌లంద‌రినీ ఇళ్ల‌లోనే ఉండాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని కోరుతున్నారు. ప‌లు ట్వీట్స్‌, వీడియో ప్రొమోతో క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రియాంక చోప్రా, ర‌ణ‌భీర్ క‌పూర్‌, ఆలియాభ‌ట్ త‌దిత‌రులు క‌లిసి ఓ షార్ట్ ఫిలిం చేయ‌బోతున్నార‌ట‌.

ప్ర‌సూన్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ షార్ట్ ఫిలిం అమితాబ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొంద‌నుంది. ఈ షార్ట్ ఫిలింకు ఫ్యామిలీ అనే పేరు పెట్ట‌నున్నారు. ఇందులో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో పాటు దాని నుండి ఎలా జాగ్ర‌త్త‌గా బ‌య‌ట‌ప‌డాల‌నే విష‌యాల‌ను చెబుతార‌ట‌.

Get Breaking News Alerts From IndiaGlitz