close
Choose your channels

విమానంలో కమెడియన్‌ వెకిలి చేష్టలు.. షాకిచ్చిన ఇండిగో!

Wednesday, January 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విమానంలో కమెడియన్‌ వెకిలి చేష్టలు.. షాకిచ్చిన ఇండిగో!

బస్సు, ట్రైన్ లేదా విమాన ప్రయాణం ఇలా ఏదైనా సరే తోటి ప్రయాణికులతో మంచిగా ఉండకపోయినా పర్లేదు కానీ.. వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. అయితే కొందరు అదే పనిగా పెట్టుకుని తోటి ప్రయాణికులతో కామెడీ చేస్తూ.. చిత్రవిచిత్రాలుగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఒక్కోసారి సీన్ రివర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఇప్పుడు మీరు చదవబోయే వార్తే.. చక్కటి ఉదాహరణ. ఇంతకీ ఏం జరిగింది..? అనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది!
ఇండిగో విమానంలో (6E 5317) ముంబై నుంచి లక్నోకు మంగళవారం నాడు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ అర్ణబ్‌ గోస్వామి, స్టాండప్‌ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కునాల్‌ కమ్రా ప్రయాణిస్తున్నారు. మహా గంట సేపు ఓపికపడితే ఎవరి దారిన వాళ్లు వెళ్తారు. కానీ.. ఆ గంట కూడా ఓపిక లేదేమో ఈ కమెడియన్‌కు.. తోటి ప్రయాణికుడైన అర్ణబ్‌ను ఇబ్బంది పెట్టాడు. అంతటితో ఆగని ఆయన.. ‘నువ్వు పిరికివాడివా? జర్నలిస్టువా? జాతీయవాదివా? జనానికి తెలియాలి’ అని రెచ్చగొడుతూ వెకిలిగా మాట్లాడాడు.

అర్ణబ్ ఏం చేశారు!
అయితే ఇంతలా రెచ్చగొడుతున్నా వీడెవడ్రా బాబూ.. పిచ్చోడిలా ఉన్నాడే అనుకున్నాడేమో కానీ అర్ణబ్ మాత్రం కమ్రా ప్రశ్నలకు స్పందించలేదు. ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని ల్యాప్‌టాప్‌ చూసుకుంటూ ఉండిపోయారే తప్ప ఆయన మాత్రం అస్సలు రియాక్ట్ కాలేదు. విమానంలో జరిగిన ఈ ఘటన తాలుకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై ఇండిగో స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యింది.

మూల్యం చెల్లించుకున్న కమ్రా!
విమానంలో ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడినందుకు గాను కునాల్‌ తీరును అమర్యాదకరంగా భావించిన ఇండిగో ఆయన్ను తమ విమానాల్లో 6 నెలలు ప్రయాణించకుండా నిషేధం విధిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

విమానయాన మంత్రి స్పందన!
ఈ వ్యవహారంపై కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విమానం లోపల అవాంతరాలను రేకెత్తించడం మర్యాద కాదని.. ఇది ఇతర ప్రయాణికుల భద్రతకు హాని కలిగిస్తుందన్నారు. హాస్యనటుడిపై ఇలాంటి నిషేధం విధించాలని ఇతర విమానయాన సంస్థలకు మంత్రి హర్దీప్ సూచించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.