close
Choose your channels

'ఇంద్రసేన' సెన్సార్ పూర్తి

Saturday, November 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటించిన చిత్రం `ఇంద్రసేన`. ఆర్.స్డూడియోస్, విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై జి.శ్రీనివాసన్ దర్శ‌క‌త్వంలో రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని `ఇంద్రసేన` చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

సీనిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ క్లియ‌ర్ కావ‌డంతో సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా ఏక కాలంలో న‌వంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.

డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగులో త‌నకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోనికి సినిమాల‌కు తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి ఆద‌ర‌ణ ఉంది. గ‌తంలో కూడా నకిలీ, డా.స‌లీంల‌తో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని `బిచ్చ‌గాడు`తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ చిత్రాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్సెస్ సాధించారు.

బిచ్చ‌గాడు చిత్రంలోని మ‌ద‌ర్ సెంటిమెంట్‌కు త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను తోడు చేసి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించిన విజ‌య్ ఆంటోని `ఇంద్ర‌సేన` చిత్రంలో బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక్టుకోవ‌డానికి సిద్ధ‌మైయ్యారు విజ‌య్ ఆంటోని. బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో పాటు హై ఎమోష‌న్స్ కాంబినేష‌న్స్‌తో రూపొందింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.