చిరు, మోహ‌న్‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌

మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు కెరీర్ ప్రారంభంలో ఇద్ద‌రూ క‌లిసి సినిమాలో న‌టించారు. నాయ‌కుడు, ప్ర‌తినాయ‌కుడు పాత్ర‌ల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. చిరు డాన్సులు, ఫైట్స్‌కు పెట్టింది పేరైతే.. డిఫ‌రెంట్ డైలాగ్ మేన‌రిజ‌మ్ మోహ‌న్‌బాబు సొంతం. వీరిద్దరూ కొన్నిరోజుల క్రితం టామ్ అండ్ జెర్రీలాగా జ‌గ‌డ‌మేసుకున్నారు. కానీ క‌లిసి పోయారు. ఇప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది.

తాజాగా ఉగాది సంద‌ర్భంగా చిరంజీవి సోష‌ల్ మీడియాలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప‌లువురు స్టార్స్ చిరంజీవిని ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చినందుకు స్వాగ‌తిస్తున్నారు. ఆ కోవ‌లో మంచు మోహ‌న్‌బాబు కూడా చిరుకు ‘స్వాగ‌తం మిత్ర‌మా’ అని ట్విట్ట‌ర్ ద్వారా స్వాగతం తెలిపాడు. దీనికి చిరంజీవి బదులిస్తూ థాంక్యూ మిత్రమా! రాన‌నుకున్నావా.. రాలేన‌నుకున్నావా? అంటూ ఇంద్ర సినిమాలోని ట్వీట్ చేశారు. ప్ర‌తిగా మోహ‌న్‌బాబు త‌న స్టైల్లో ఈసారి హ‌గ్ చేసుకున్న‌ప్పుడు చెబుతా అంటూ స‌మాధానం చెబుతూ క‌న్నుగీటే ఎమోజీని పోస్ట్ చేశారు.

వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. నెటిజ‌న్స్.. ఎవ‌రూ త‌గ్గ‌లేదుగా అని అంటే.. మీరు ఇలా స‌ర‌దాగాఉంటే హ్యాపీగా ఉందంటున్నారు.

More News

సినీ కార్మికులకు చిరంజీవి భారీ విరాళం

కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ అవ్వడంతో టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు మొదలుకుని రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. దీంతో సినీ కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

చెర్రీని అభినందించిన పవన్ కల్యాణ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విరాళం ప్రకటించారు.

కొంతమంది ‘సినిమా’కు అవసరం : హరీష్

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్న తరుణంలో.. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఆపన్నహస్తంగా పలువురు ప్రముఖులు ఆర్థికంగా సాయం చేస్తున్నారు.

క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు రామ్‌చ‌ర‌ణ్ రూ.70 ల‌క్షలు విరాళం

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

కరోనాపై యుద్ధం.. పవన్ కల్యాణ్ భారీ విరాళం

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా