close
Choose your channels

పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్..

Friday, October 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమాను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘హై ఓల్టేజ్ రోల్‌లో తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఈజ్ బ్యాక్’ అంటూ పవన్ కొత్త సినిమాకు సంబంధించిన విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. దీంతో పవన్ అభిమానులు బాగా ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో ఓ యంగ్ హీరోతో పాటు ఓ స్టార్ హీరోయిన్ కూడా ఛాన్స్ కొట్టేసినట్టు ఫిలింగనర్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ హీరోహీరోయిన్లు ఎవరో కాదు.. నితిన్ - సాయిపల్లవి. నితిన్‌కు పవన్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా ఈ సినిమాలో నితిన్‌కు అవకాశం వస్తే అది తన అదృష్టంగా ఫీల్ అవుతాడనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన అయ్యప్పన్ కొషియమ్’కు రీమేక్‌గా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయిందని ప్రచారం జరగుతోంది.

‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసిందని టాక్. అయితే మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో రానా పోషిస్తాడని ఇటీవల లాక్ నడిచింది. అయితే తాజాగా పృథ్వీరాజ్ పాత్రను నితిన్ పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. హీరోయిన్‌గా సాయిపల్లవి ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ వార్తలకు సంబంధించిన నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.