ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో అఖిల్‌?

  • IndiaGlitz, [Monday,February 03 2020]

అక్కినేని మూడో త‌రం న‌ట వార‌సుడిగా.. అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న అక్కినేని అఖిల్ బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ మూడు సినిమాలు చేశాడు. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాల్లో అఖిల్ న‌టించాడు. తొలి చిత్రం అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక మిగిలిన రెండు చిత్రాలు ప‌రావాలేద‌నిపించాయి. కానీ అఖిల్ మాత్రం పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాడు. అఖిలే కాదు..నాగార్జున కూడా అదే కావాల‌నుకుంటున్నాడు. మంచి స్టార్ట్ అప్ కోసం ఎదురు చూసిన అఖిల్ ఇప్పుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌తో సినిమా చేస్తున్నాడు. నిజానికి బొమ్మ‌రిల్లు భాస్క‌ర్‌కి కూడా స‌క్సెస్ లేదు. బెంగ‌ళూర్ డేస్ త‌మిళ రీమేక్ త‌ర్వాత భాస్క‌ర్‌కు సినిమా లేదు. ఎట్ట‌కేల‌కు గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ అనుబంధ సంస్థ జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ నిర్మాత‌లుగా సినిమా ఎప్పుడో ప్రారంభ‌మైంది.

అఖిల్ స‌ర‌స‌న పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమా విడుద‌ల చేసేలా ప్లాన్ జ‌రుగుతుంది. ఈ సినిమా టైటిల్‌ను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాగా.. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. టైటిల్ పెద్ద‌దిగానే ఉన్నా కూడా యూత్ టార్గెట్‌గా ఉంది కాబట్టి ఈ టైటిల్‌నే ఖ‌రారు చేయాల‌నుకుంటున్నార‌ని స‌మాచారం. ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ అనే ప‌దాలు చిన్న‌విగా.. బ్యాచిల‌ర్ అనే ప‌దం పెద్ద‌దిగా ఉండేలా ప్లాన్ చేశార‌ట‌. మ‌రి ఈ స‌స్సెన్స్ తొల‌గిపోవాలంటే మాత్రం ఈ నెల 4 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

ఒక్క సినిమాకే ఇక సెలవంటే ఎలా రాములమ్మా..!?

టాలీవుడ్ సీనియర్‌ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’

బన్నీ, నాని సినిమా చూసి అలా అన్నారు: దిల్ రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో

‘కరోనా’ : కేవలం 9 రోజుల్లోనే చైనా అద్భుతం..!

‘మనిషి అనుకుంటే కానిది ఏమున్నది’ అనే పాట అందరికీ గుర్తుండే ఉంటుంది.. నిజంగానే మనిషి గట్టిగా తలుచుకుంటే ఏదైనా చేయగలడు..

న‌వీన్ చంద్ర హీరోగా 'నేను లేని నా ప్రేమ‌క‌థ‌'

విభిన్న‌మైన పాత్ర‌లు ఎంచుకుని మ‌రీ సెల‌క్ట్ గా సినిమాలు చేస్తూ త‌న‌కంటూ న‌టుడిగా ప్ర‌త్యేఖ స్థానం సంపాయించుకున్న న‌వీన్ చంద్ర హీరోగా ఒ కొత్త‌ర‌కం ప్రేమ క‌థా

త‌న సినిమా గురించి ఎగ్జ‌యిట్ అవుతున్న క్రికెట‌ర్‌

క్రికెట్ త‌ర‌పున ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించిన అంద‌రూ త‌ర్వాత కామెంటేట‌ర్స్‌గానో, సెల‌క్ట‌ర్స్‌, కోచ్‌లు లేక‌పోతే బిజినెస్‌మేన్‌లుగా మాతుంటారు.