నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌..!

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లిస్టులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించే సినిమా కూడా ఉంది. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు సంబంధించి 'వ‌రుడు కావాలి' అనే ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. రీతూవ‌ర్మ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇది కాకుండా సంతోష్ జాగర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నాగ‌శౌర్య న‌టిస్తున్నాడు. అనీల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న సొంత బ్యాన‌ర్‌లోనే ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది.

గ‌త ఏడాది నాగ‌శౌర్య‌కు పెద్ద‌గా క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఎందుకంటే అటు న‌టుడిగా, ఇటు నిర్మాత‌గా నాగ‌శౌర్య‌కు హిట్ లేదు. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన 'ఓబేబీ' చిత్రంలో నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఫలితం శౌర్య‌కు కాస్త ఊర‌ట‌నిచ్చింది. ఇక 2020లో ఏ సినిమా విడుద‌ల‌య్యే అవ‌కాశం లేదు. దీంతో నాగ‌శౌర్య ఆశ‌ల‌న్నీ 2021పైనే ఉన్నాయి. చేస్తున్న నాలుగు చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి స‌క్సెస్‌ను అందిస్తుంద‌నేది తెలియాలంటే వెయిటింగ్ త‌ప్ప‌దు.

More News

దేశ వ్యాప్తంగా 54 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది.

ఆట మొదలైంది...

ఓపెనింగే అఖిల్‌తో మోనాల్ మీటింగ్. మోనాల్ కూర్చొని ఉంటే అవాయిడ్ చేశాడట. వచ్చి అడిగింది.

`వ‌కీల్‌సాబ్` రాక ఖ‌రారైన‌ట్లే..!

పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత న‌టిస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’.

బాల‌య్య సినిమాలో మ‌రో హీరోయిన్ ఎవ‌రంటే..?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్..

పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.