‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్...

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించిన విషయాన్ని కూడా ఓ అద్భుతమైన వీడియోగా మలిచి చెప్పారు. రాజమౌళి మేకింగ్ అంటేనే సమ్ థింగ్ స్పెషల్. అందుకే ఆయనను జక్కన్న అంటారు. ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ను శరవేగంగా నడిపిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరెక్కుతోంది. సినిమాను ప్రకటించిన నాటి నుంచి నేటి వరకూ ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గానే ఉంది.

కాగా.. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్ ప్రచారంలో ఉంది. రాజమౌళి తీసిన యాక్షన్ ఎపిసోడ్. ఎనిమిది నిమిషాల నిడివి గల ఈ యాక్షన్ ఎపిసోడ్.. సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఒకటని సమాచారం. దీనికోసం రాజమౌళి ప్రత్యేక దృష్టి సారించారట. అందుకే ఎనిమిది నిమిషాల సీన్ కోసం యాభై రోజులకు పైగానే కేటాయించారని టాక్. యాక్షన్ ఎపిసోడ్‌లో పర్‌ఫెక్షన్ కోసం రాజమౌళి ఏమాత్రం కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఎనిమిది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో వేచి చూడాలి.

కాగా.. ఈ సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల ఈ భారీ బడ్జెట్ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More News

ఇంకెన్ని రోజులు రైతులకు ఈ పరిస్థితి..: సోనూసూద్

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్‌ రైతులు ప్రాణాలను సైతం లెక్కచేయక ఆందోళన నిర్వహిస్తున్నారు.

'హ‌ర్లా ఫర్లా' సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న విశాల్ 'చ‌క్ర'

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`.  శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయమందిస్తూ.. ఐదుగురి దుర్మరణం

ముక్కూ మొహం తెలియకున్నా.. తోటి మనిషి ప్రమాదంలో గాయపడ్డాడని వారి హృదయం తల్లడిల్లిపోయింది.

తెలంగాణలో రాజా సాబ్ కొడుకో.. నిజాం చెంచానో సీఎం కాడు: తరుణ్ ఛుగ్

తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు.

నన్నూ, ఆర్జీవీని చంపేయండి: నట్టి కుమార్

తనను, ఆర్జీవీని చంపేసి అనంతరం థియేటర్‌ను ధ్వంసం చేయాలని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు.