నితిన్‌.. ఇంట‌ర్నేష‌న‌ల్ మేక‌ప్ మ్యాన్‌

  • IndiaGlitz, [Friday,June 19 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా త‌ర్వాత నితిన్‌కు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో ముందుగా విడుద‌ల కావాల్సింది రంగ్‌దే సినిమా. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. అదే స‌మ‌యంలో క‌రోనా రావ‌డంతో సినిమా షూటింగ్ ఆగింది.

క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే నితిన్ రంగ్‌దే సినిమాను పూర్తి చేసి త‌దుప‌రి సినిమాల‌పై ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడు. నితిన్ వ‌రుస‌లో ఉన్న సినిమాల్లో కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోయే ప‌వ‌ర్ పేట సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో నితిన్ మూడు షేడ్స్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. 20...40..60 ఏళ్ల వ్య‌క్తిగా మూడు షేడ్స్‌లో నితిన్ క‌న‌ప‌డ‌బోతున్నాడట‌. ఈ మూడు షేడ్స్‌ను స‌రికొత్త‌గా చూపించ‌డానికి ఇంట‌ర్నేష‌న‌ల్ మేక‌ప్ మ్యాన్‌ను తీసుకురావ‌డాఆనికి నితిన్ అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తుంద‌ట‌. మ‌రి క‌రోనా ప‌రిస్థితుల్లో ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుందో చూడాలి. అలాగే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్‌గా ఎవ‌రిని తీసుకోవాల‌ని పెద్ద చ‌ర్చే జ‌రిగింది. చివ‌ర‌కు కీర్తిసురేష్‌నే ఎంపిక చేశార‌ని టాక్ విన‌ప‌డుతోంది.

More News

నాగ్ మ‌రోసారి అదే ప్ర‌య‌త్నం!!

కింగ్ నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’లో ఎన్ఐఏ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

డ్రాగన్ ఆధీనంలో ఉన్న 10 మంది భారత్ సైనికుల విడుదల?

ఇద్దరు ఉన్నతాధికారులు సహా డ్రాగన్ ఆధీనంలో ఉన్న 10 మంది భద్రతా సిబ్బంది విడుదలైనట్టు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది.

ఏపీ కరోనా బులిటెన్: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఏపీలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయి.

చంద్రబాబుకి షాకిచ్చిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని

అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి.

29 మందికే వారలా చేస్తే.. 151 మంది ఉన్న మేమేం చెయ్యాలి: రోజా

టీడీపీ శాసనమండలిలో వాపును చూసి బలుపు అనుకుంటోందని.. 29 మంది ఉంటేనే వారలా చేస్తే..