ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,November 04 2016]

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. ఈ నెల 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఇందులో భూత‌వైద్యుడు గెట‌ప్ లో అల్ల‌రి న‌రేష్ ఓ ఇంటికి వెళ్ల‌డం.... అక్క‌డ ఓ దెయ్యం త‌న‌కు పెళ్లి జ‌ర‌గాలి అంటూ ఆరాట‌ప‌డ‌డం...ఎంట‌ర్ టైనింగ్ గా ఉంది. ఈ చిత్రంలో రాజేంద్ర‌ప్ర‌సాద్, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ్రీనివాస‌రెడ్డి, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. హ‌ర్ర‌ర్, ఎంట‌ర్ టైన్మెంట్, సస్పెన్స్...ఇలా ప్రేక్ష‌కుల‌కు కావ‌ల‌సిన అన్ని అంశాలు ఉన్న‌ట్టు అనిపిస్తుంది. అల్ల‌రి న‌రేష్ కి చాలా రోజులు నుంచి అనుకున్న స‌క్సెస్ రావ‌డం లేదు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే...ఈసారి అల్ల‌రి న‌రేష్ స‌క్సెస్ సాధించ‌డం ఖాయం అనిపిస్తుంది.

More News

అంతటి ధైర్యవంతుల మధ్య గడపడం నా అదృష్టం : మెహరీన్ కౌర్ పిర్జాదా

నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. అందరి మనసులో చెరగని సంతకం చేసింది మేహరీన్. నాని కథానాయకుడిగా నటించిన "కృష్ణగాడి వీరప్రేమగాధ"తో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ సుందరి మెహరీన్ పుట్టినరోజు రేపు (నవంబర్ 5).

త్రిష పెళ్లి క్యాన్సిల్ కి కార‌ణం ఇదే..!

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌,వెంక‌టేష్...ఇలా అగ్ర‌హీరోల‌తో న‌టించి తెలుగులో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న క‌థానాయిక త్రిష‌. తెలుగు, త‌మిళ్ చిత్రాల్లో న‌టిస్తూ సౌత్ లో బాగా పాపుల‌ర్ అయిన త్రిష ఎంగేజ్ మెంట్ త‌ర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

నా గురువు & నా హీరోకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు - జ‌గ‌ప‌తి..!

నా గురువు & నా హీరోకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని జ‌గ‌ప‌తి బాబు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ...జ‌గ్గుభాయ్ బ‌ర్త్ డే విషెష్ చెప్పింది ఎవ‌రికి అని అనుకుంటున్నారా..?

ఆ డైరెక్ట‌ర్ కి ఆడి కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్..!

సినిమా స‌క్సెస్ అయితే...ఆ ద‌ర్శ‌కుడికి కారు గిఫ్ట్ గా ఇస్తుంటారు కొంత మంది నిర్మాత‌లు, హీరోలు..! శ్రీమంతుడు సినిమా బ్లాక్ బ‌ష్ట‌ర్ అవ్వ‌డంతో కొర‌టాల శివ‌కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ర‌జ‌నీ మూవీని రీమేక్ చేస్తున్న లారెన్స్..!

కొరియోగ్రాఫ‌ర్ గా, హీరోగా, డైరెక్ట‌ర్ గా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విజ‌యం సాధించిన మ‌ల్టీ టాలెంటెడ్ ప‌ర్స‌న్ రాఘ‌వ లారెన్స్. కాంచ‌న‌, గంగ చిత్రాల‌తో హ‌ర్ర‌ర్ మూవీస్ లో ఓ సంచ‌ల‌నం సృష్టించిన లారెన్స్ ఇప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీ మూండ్రు ముగమ్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.