ఐపిసి సెక్షన్.. భార్యాబంధు పాటల విడుదల

  • IndiaGlitz, [Friday,June 01 2018]

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు. 'సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్' అన్నది స్లోగన్. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన రెట్టడి శ్రీనివాస్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఆలూరి క్రియేషన్స్ పతాకంపై.. ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు విడుదల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది.

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ దర్శకులు ఎన్. శంకర్, ప్రముఖ దర్శక నటుడు దేవీప్రసాద్ లతో పాటు యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరశ్చంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో.. నేహా దేశ్ పాండే హీరోయిన్. నిన్నటి మేటి కథనాయకి ఆమని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఒక్కో పాటను ఒక్కో అతిధి విడివిడిగా విడుదల చేయగా..బిగ్ సీడీని సి.కళ్యాణ్ ఆవిష్కరించారు. సీడీ బాక్స్ ఎం.శంకర్ విడుదల చేసి తొలి ప్రతిని దేవీప్రసాద్ కి అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్రానికి మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం సమకూర్చారు. లహరి మ్యూజిక్ ఈ చిత్రం ఆడియో హక్కుదార్లు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి రూపొందించిన ఐపిసి సెక్షన్.. భార్యాబంధు మంచి విజయం సాధించాలని అతిధులు అభిలషించారు.

నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ.. 'సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చర్చించిన అంశం గురించి మాట్లాడుకుంటారు' అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశమిచ్చి.. విడుదలయ్యాక అందరూ గొప్పగా మాట్లాడుకునే మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన నిర్మాత ఆలూరి సాంబశివరావు గారికి, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అన్నారు. హీరోగా పరిచయమవుతున్న శరశ్చంద్రకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, ఆమని పాత్ర, విజయ్ కురాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల విజయ్ కురాకుల, మౌనశ్రీ మల్లిక్ కృతజ్ఞతలు తెలియజేశారు.

మధునందన్, వాసు ఇంటూరి, భరత్ (ఫన్ బకెట్), బస్ స్టాప్ కోటేశ్వరరావు, అప్పలరాజు, తడివేలు, రాగిణి, రమణీ చోదరీ, మహిజ, రశ్మి, ఇంద్రాణి, సంగీత ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. మాటలు: అల్లూరి సీతారామరాజు-అంకాలపు శ్రీనివాస్, పాటలు: మౌనశ్రీ మల్లిక్, ఆర్ట్: కె.వి.రమణ, పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, ప్రొడక్షన్ కంట్రోలర్: ధవళ చిన్నారావు, కో-డైరెక్టర్: కె.సేతుపతి, రచనాసహకారం-చీఫ్ కో-డైరెక్టర్: బి.సుధాకర్ రాజు, ఎడిటింగ్: బి.మహేంద్రనాథ్, సినిమాటోగ్రఫీ: పి.శ్యామ్, సంగీతం: విజయ్ కూరాకుల, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం; రెట్టడి శ్రీనివాస్!!