ఐపీఎల్‌-2020 షెడ్యూల్‌ వచ్చేసింది..

  • IndiaGlitz, [Sunday,September 06 2020]

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2020 షెడ్యూల్‌ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐపీఎల్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.. ఆది నుంచి అవరోధలే.. అయినా బీసీసీఐ వెనక్కి తగ్గలేదు. ప్రతి ఏడూ కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని విడువకుండా ఈ సీజన్‌ను కూడా గతేడాది ఫైనల్ లిస్టుతోనే ప్రారంభించేందుకు ప్లాన్ సిద్ధం చేసేసింది. సెప్టెంబర్ 19నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

19న అబుదాబిలో డిఫెండింగ్ చాంపియన్స్ అయిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు, ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అబుదాబిలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. అనంతరం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. దుబాయ్‌లో 24, షార్జాలో 20, అబుదాబిలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.

రెండో మ్యాచ్ 20న దుబాయ్‌లో ఢిల్లీ కేపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరగనుంది. ఈ నెల 21న సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. రాజస్థాన్ రాయల్స్-సీఎస్‌కే జట్లు 22న షార్జాలో తలపడనున్నాయి. నవంబరు 7న క్వాలిఫయర్-1, నవంబరు 8న ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబరు 9న క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా, 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్‌లో 24, షార్జాలో 20, అబుదాబిలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.

More News

లాక్‌డౌన్‌లో నేర్చుకున్న విష‌యాల‌వే:  అదితిరావు హైదరి

అదితిరావు హైదరి.. మన హైదరాబాదీ అమ్మాయి. అయితే కెరీర్‌ ప్రారంభంలో మలయాళ, హిందీ, తమిళ, మరాఠీ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తూ వచ్చారు.

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రమాదం తృటిలో తప్పిపోయింది. చంద్రబాబు కాన్వాయ్‌లో

సుధీర్‌బాబు ఇన్‌స్పైరింగ్ స్టోరీ.. ‘వి’ షూటింగ్‌కు ముందు ఏం జరిగిందంటే..

హీరో సుధీర్ బాబు ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను విడుదల చేశాడు. ‘వి’ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజుల ముందు ఏం జరిగిందో ఆ వీడియోలో సుధీర్‌బాబు వివరించాడు.

ట్రైన‌ర్‌కు ప్ర‌భాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ప్యాన్ ఇండియా రెబల్‌స్టార్ ప్ర‌భాస్  త‌న వాళ్ల‌కు అప్పుడప్పుడు గిఫ్టులిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ఉంటాడు.

ఆల‌స్యమైంది.. కానీ ధ‌న్య‌వాదాలు చెప్పిన బాల‌య్య‌

నంద‌మూరి బాల‌కృష్ణ ఓ ప్ర‌ముఖ వ్య‌క్తికి ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు చెప్పారు. అయితే ఈ ధ‌న్య‌వాదాలు చెప్ప‌డంలో ఆల‌స్యం జ‌రిగింది కానీ..