Travel Insurance: 0.45 పైసలతో రూ.10 లక్షల ప్రమాద బీమా.. టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ స్కిప్ చేస్తున్నారా..?

  • IndiaGlitz, [Saturday,June 03 2023]

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంతో దేశవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలికాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రమాదంలో మరణించిన, గాయాలైనవారిలో ఒడిషా, బెంగాల్ వాసులే అధిక సంఖ్యలో వున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు వాసులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అండగా వుంటామని తెలిపారు.

కేవలం 0.45 పైసలకే రూ.10 లక్షల బీమా:

ఈ ప్రమాదం నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ అందించే ప్రమాద బీమా గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. కేవలం 0.45 పైసలకే రూ.10 లక్షల బీమా మీ కుటుంబ సభ్యులకు అందుతోంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ వస్తుంది. కానీ దీనిని చాలా మంది స్కిప్ చేస్తూ వుంటారు. కానీ అక్కడ కనిపించే బాక్స్‌లో టిక్ చేయడం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే మీ కుటుంబానికి భరోసా కల్పించినవారవుతారు. కానీ చాలా మంది 0.45 పైసలు వేస్ట్ చేయడం ఎందుకని ఈ ఆప్షన్‌ని పట్టించుకోరు. నిత్యం వేలాది రూపాయలను దుబారాగా ఖర్చు పెట్టే మనం అర్ధ పైసా విషయంలో సవాలక్ష ఆలోచిస్తూ వుండటం నిజంగా దురదృష్టకరం. కానీ ఇప్పుడు ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో అందరూ ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఆప్షన్‌పై సీరియస్‌గా దృష్టి పెడితే మంచిది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎలా..?

టికెట్ బుక్ చేసేందుకు మనం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లోకి వెళ్లినప్పుడు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ బాక్స్‌లో టిక్ పెట్టిన అనంతరం మన మొబైల్ నెంబర్, ఈ మెయిల్‌కి సదరు బీమా సంస్థ ఓ లింక్ పంపుతుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు పూరించాలి.. తద్వారా జరగరానిది జరిగినప్పుడు నామినీగా వున్న వ్యక్తి బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.

ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు :

రైలు ప్రయాణంలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రయాణికుడు మరణిస్తే బాధితుడి కుటుంబానికి రూ. 10 లక్షలు బీమా అందజేస్తారు. అలాగే పూర్తి స్థాయిలో అంగవైకల్యం పొందినా అతనికి రూ.10 లక్షలను అందజేస్తారు. పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, గాయాలైతే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన 120 రోజుల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. సదరు బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి.. అక్కడి ప్రతినిధులు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

More News

Pawan Kalyan: ఒడిషా రైలు ప్రమాదం.. ఇకనైనా భద్రతా చర్యలు తీసుకోండి : కేంద్రానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని

Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదం : రెండు రైళ్లలో 120 మంది ఏపీ వాసులు..

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది.

Odisha Train Accident: మాటలకందని మహా విషాదం: ఒడిషాకు మోడీ.. ప్రమాదస్థలిని పరిశీలించనున్న ప్రధాని

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని..

Sirf Ek Bandaa Kaafi Hai: 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ట్రైలర్: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం

అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం

Pawan Kalyan Vaarahi: ఆ రోజు నుండి రోడ్డెక్కనున్న పవన్ వారాహి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి ద్వారా జనాల్లోకి వెళ్లనున్నారు.