లాక్‌డౌన్ పొడిగింపు పక్కా.. IRCTC సంకేతాలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడికి మార్చి 24 నుంచి ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం విదితమే. మరికొన్ని రోజుల్లో ఈ లాక్‌డౌన్ పూర్తి కానుంది. ఇప్పట్లో లాక్‌డౌన్ ఎత్తేద్దామన్నా అయ్యే పనికాదు. ఎందుకంటే రోజురోజుకూ దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య.. మరణాల సంఖ్య పెరుగుతోందో కానీ అస్సలు తగ్గట్లేదు. ఈ క్రమంలో లాక్‌డౌన్ పొరపాటున ఎత్తేస్తే ఒక్కసారిగా ఊహించని రీతిలో కేసులు పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడిక దేశాన్ని కంట్రోల్ చేయడం అస్సలు అయ్యే పనే కాదని పలువురు విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్రం కూడా లాక్‌డౌన్ పొడిగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్-11న మోదీ కీలక ప్రకటన చేయబోతున్నారు. బహుశా ఆ ప్రకటన లాక్‌డౌన్ పొడిగింపుపైనే ఉండొచ్చు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం లాక్‌డౌన్ పొడిగించాల్సిందేనని కేంద్రంపై గట్టిగానే ఒత్తిడి తెస్తున్నాయి.

కచ్చితంగా పొడిగింపే..

ఈ క్రమంలో రైల్వేశాఖ ఓ కీలక ప్రకటన చేసింది. అదేమిటంటే.. టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ఓ ప్రకటనలో తేల్చిచెప్పేసింది. అంటే.. లాక్‌డౌన్ కచ్చితంగా ఉంటుందని దీన్ని బట్టి స్పష్టంగా తెలిసిపోయింది. ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకొచ్చింది. ఏప్రిల్-14 తర్వాత లాక్‌డౌన్ దశలవారిగా ఎత్తేస్తారని మొదట్నుంచి కేంద్రం చెబుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఐఆర్సీటీసీ తాజాగా ఈ ప్రకటన చేసిందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రాల ఆర్టీసీలు సైతం ఇంతవరకూ ఏప్రిల్-14 తర్వాత బస్సులు తిరుగుతాయని కానీ.. టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చని కానీ ఎక్కడా చెప్పలేదు.

ముందే అప్రమత్తమా..!?

ముందుగానే ఆర్టీసీ, ఐఆర్‌సీటీసీని అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. లాక్‌డౌన్ పొడిగింపును అధికారికంగా ఏప్రిల్-11న ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి శనివారం నాడు మోదీ ఏం చెప్పబోతున్నాడు..? రాష్ట్రాల ముఖ్యమంత్రుల డిమాండ్‌నే మోదీ అమలు చేస్తారా..? లేకుంటే మోదీ దగ్గర మరో ప్లాన్ ఏమైనా ఉందా..? అనేది తెలియాలంటే కీలక ప్రకటన వచ్చినంతవరకూ వేచి చూడక తప్పదు.

More News

ఒక్కరోజే ఇండియాలో 32 మంది మృతి.. 773 కరోనా పాజిటివ్‌లు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇండియాలో కూడా దీనిప్రభావం గట్టిగానే పడింది. రోజురోజుకు కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌).

ప‌వ‌న్‌, ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్‌.. రీమేకా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొంద‌నుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ నెల 11న మోదీ కీలక ప్రకటన.. వాట్ నెక్స్ట్!?

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్-11న కీలక ప్రకటన చేయబోతున్నారా..? ఆ ప్రకటన లాక్‌డౌన్ గురించేనా..? లాక్‌డౌన్ పొడిగించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయా..?

రకుల్ కొత్తగా యూట్యూబ్ చానెల్.. ఆదాయమంతా..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో యావత్ ఇండియా వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం జరిగింది. దీంతో ప్రజారవాణా మొదలుకుని సినిమా షూటింగ్స్,